Mothers Day: అమ్మా! నీకు వందనం అంటున్న కేటీఆర్.. మాతృదినోత్సవాన అరుదైన ట్వీట్

Mothers day: ఈ సందర్భంగా తన తల్లి శోభతో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పెట్టారు. అందులో ఒకటి చిన్నప్పుడు కలిసి దిగిన ఫోటో కాగా, మరోటి హరితహారంలో భాగంగా తల్లితో కలిసి మొక్కను నాటుతున్న ఫోటోను ట్వీట్ చేశారు.

news18-telugu
Updated: May 13, 2019, 8:54 AM IST
Mothers Day: అమ్మా! నీకు వందనం అంటున్న కేటీఆర్.. మాతృదినోత్సవాన అరుదైన ట్వీట్
తన తల్లి శోభతో దిగిన ఫోటోను ట్వీట్ చేసిన కేటీఆర్
news18-telugu
Updated: May 13, 2019, 8:54 AM IST
సృష్టికి మూలం.. అమ్మ. ప్రేమ త్యాగాల రూపం.. అమ్మ. అపురూపమైన అమృత హస్తం.. అమ్మ. అమ్మతోనే పుట్టుక ప్రారంభం అవుతుంది. విలువ కట్టలేని ప్రేమను అందించే అమ్మకు అంతర్జాతీయ మాతృ దినోత్సవాన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన అమ్మకు.. అద్భుతమైన అమ్మలందరికీ అంతులేని ప్రేమతో, నిరంతరం అండగా నిలుస్తూ, ఈ స్థాయిలో మేం ఉండటానికి మీరు చేసిన సేవలకు అసంఖ్యాక కృతజ్ఞతలు అని ఆదివారం ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తన తల్లి శోభతో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పెట్టారు. అందులో ఒకటి చిన్నప్పుడు కలిసి దిగిన ఫోటో కాగా, మరోటి హరితహారంలో భాగంగా తల్లితో కలిసి మొక్కను నాటుతున్న ఫోటోను ట్వీట్ చేశారు.

కాగా, ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం చెన్నై బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన అక్కడ డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఫ్రంట్ విషయంపై చర్చించనున్నారు. గత వారం కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించిన సంగతి తెలిసిందే.



First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...