KTR Etela Rajendar: చివరివరకు ప్రయత్నించా.. ఈటల రాజేందర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఈటల రాజేందర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

KTR Etela Rajendar: ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్‌ ఎంత చేసిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.

  • Share this:
    మాజీమంత్రి ఈటల రాజేందర్‌ వ్యవహారంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈటల రాజేందర్ పార్టీలోనే ఉండేలా చివరి వరకు ప్రయత్నించానని కేటీఆర్ అన్నారు. కేబినెట్‌లో కొనసాగుతూనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈటల తప్పుబట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ల నుంచి కేసీఆర్‌తో గ్యాప్ ఉంటే ఈటల రాజేందర్ కేబినెట్‌లో ఎందుకు కొనసాగారని ఆయన ప్రశ్నించారు. ఈటల రాజేందర్ అడ్డంగా మాట్లాడినా కేబినెట్‌లో కేసీఆర్ కొనసాగించారని అన్నారు. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్‌ ఎంత చేసిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.

    ఈటల రాకముందు కూడా కమలాపూర్‌లో టీఆర్ఎస్ బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. అనామకుడు ఉత్తరం రాస్తే ఈటలపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్‌ది ఆత్మవంచన అని విమర్శించారు. పార్టీ కార్శదర్శులతో జరిగిన సమావేశంలో భాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బహిష్కరించడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఆయన బీజేపీ కండువా కప్పుకుని మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే టీఆర్ఎస్‌ను వీడిన ఈటల రాజేందర్‌పై కేసీఆర్, కేటీఆర్ మినహా ఇప్పటివరకు దాదాపు పార్టీ నేతలంతా విమర్శలు గుప్పించారు. తాజాగా కేటీఆర్ కూడా ఈటల రాజేందర్‌పై పార్టీ సమావేశంలో విమర్శలు చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: