బోణీ కొట్టిన టీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల్లో తొలి గెలుపు

అతనొక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇలా ఏకగ్రీవం రూపంలో టీఆర్ఎస్ బోణీ కొట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

news18-telugu
Updated: January 10, 2020, 6:46 PM IST
బోణీ కొట్టిన టీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల్లో తొలి గెలుపు
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఐతే పోలింగ్‌కు ముందే అధికార టీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. మంచిర్యాల జిల్లా లంపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు(జనరల్)లో టీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అతనొక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇలా ఏకగ్రీవం రూపంలో టీఆర్ఎస్ బోణీ కొట్టడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

కరీంనగర్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లలోని 325 కార్పొరేటర్, 120 మున్సిపాలిటీల్లోని 2,727 కౌన్సిలర్ స్థానాలకు జనవరి 22న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించి.. తిరస్కరరణకు గురైన వాటిని ప్రకటిస్తారు. జనవరి 12, 13 తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషనన్లపై అప్పీల్ చేసుకోవచ్చు. జనవరి 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. జనవరి 22న పోలింగ్ జరగనుండగా.. జనవరి 25న ఫలితాలను ప్రకటిస్తారు. ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలో మాత్రం 24న పోలింగ్ జరుగుతుంది. 27న ఫలితాలను వెల్లడిస్తారు.

Published by: Shiva Kumar Addula
First published: January 10, 2020, 6:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading