మున్సిపోల్స్‌లో కారు జోరు... టీఆర్ఎస్ 73, కాంగ్రెస్ 2

ఈ ఎన్నికల్లో పుంజుకుని టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ఏ మాత్రం ఫలించలేదనే విషయం ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది.

news18-telugu
Updated: January 25, 2020, 11:05 AM IST
మున్సిపోల్స్‌లో కారు జోరు... టీఆర్ఎస్ 73, కాంగ్రెస్ 2
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అంతా ఊహించనట్టుగానే టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాలను టీఆర్ఎస్ సొంతంగానే కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పుంజుకుని టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావించిన కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ఏ మాత్రం ఫలించలేదనే విషయం ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 120 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ 73, కాంగ్రెస్ 3, బీజేపీ 1 మున్సిపాలిటీని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మున్సిపల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 9 మున్సిపల్ కార్పొరేషన్లు టీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, నారాయణఖేడ్ కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఇక కొల్లాపూర్‌లో మాజీమంత్రి జూపల్లి మద్దతుదారులు పెద్దఎత్తన గెలిచి ఆ మున్సిపాలిటీని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను స్వతంత్రులుగా బరిలోకి దింపిన మాజీమంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు... వారిని గెలిపించుకోవడంలోనూ విజయం సాధించారు. ఇక మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే... టీఆర్ఎస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.




First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు