రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో మళ్లీ ఎదురుదెబ్బ...

కొడంగల్‌లో మరోసారి కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలింది.

news18-telugu
Updated: January 25, 2020, 1:17 PM IST
రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో మళ్లీ ఎదురుదెబ్బ...
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 12 వార్డుల్లో గులాబీ పార్టీ 7 గెలుపొందగా, కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు సమయం కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ.. కొడంగల్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు షాక్ అయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సంచలన రీతిలో విజయం సాధిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో మెజార్టీ జిల్లాల్లో ఫలితాలు ఏకపక్షం అయ్యాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో దాదాపు వంద మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కార్పొరేషన్లలో కూడా టీఆర్ఎస్ జోరు దూసుకుపోతోంది.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు