కరీంనగర్‌లో కారు జోరు... టీఆర్ఎస్‌కే మున్సిపల్ పీఠం

నిజామాబాద్‌లో దాదాపు సగం సీట్లను గెలుచుకున్న బీజేపీ... కరీంనగర్‌లో మాత్రం ఆ స్థాయి ఫలితాలు కనబరచలేకపోయింది.

news18-telugu
Updated: January 27, 2020, 5:20 PM IST
కరీంనగర్‌లో కారు జోరు... టీఆర్ఎస్‌కే మున్సిపల్ పీఠం
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
కరీంనగర్‌లోనూ కారు జోరు కొనసాగింది. ఎన్నికలకు ముందే రెండు స్థానాలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్... మొత్తం 34 స్థానాల్లో పాగా వేసి మున్సిపల్ కార్పొరేషన్‌ పీఠాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన సొంతం చేసుకుంది. మొత్తం 60 స్థానాలున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టీఆర్ఎస్ 34, బీజేపీ 12, ఎంఐఎం 6, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించాయి. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకోవడంతో ఇక్కడ బీజేపీ కొంతమేర బలపడినట్టు కనిపించింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించారు.

నిజామాబాద్‌లో దాదాపు సగం సీట్లను గెలుచుకున్న బీజేపీ... కరీంనగర్‌లో మాత్రం ఆ స్థాయి ఫలితాలు కనబరచలేకపోయింది. కేవలం 12 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు బాగా పెరిగిందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఓడినా... తాము బీజేపీకి గట్టి పోటీ ఇచ్చామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
First published: January 27, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు