కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు (BJP Government) తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) తన పోరాటంలో కీలక వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
ఈనెల 31 (సోమవారం) నుంచి పార్లమెంట్ (Parliament) లో బడ్జెట్ సమావేశాలు (Budget sessions) ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ దఫా కరోనా నేపథ్యంలో రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి దశ సమావేశాలు (Sessions).. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు (Corona cases) పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్లో సానిటేషన్ పనులు (Sanitation works), ఇతర ఏర్పాట్లు ముమ్మరం చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ (TRS party) కూడా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది.
రేపు మధ్యాహ్నం భేటి..
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు (BJP Government) తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) తన పోరాటంలో కీలక వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. కేసీఆర్ అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ (Pragathi Bhavan) లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం (TRS Parliamentary Party Meeting) కానున్నది.
కేంద్రం నుంచి సాధించాల్సిన నిధులు..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ (TRS party) అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన నిధులు, ఇతర పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల (Budget Sessions) సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ (TRS Party) ఎంపీలు, కేంద్రం పై అనుసరించాల్సిన పోరాట పంథా పై సీఎం కేసిఆర్ (CM KCR) ఎంపీలకు సూచనలు ఆదేశాలు జారీ చేస్తారు.
గత వర్షకాల సమావేశాల్లో (Parliament Monsoon Sessions) ఉభయసభలలో టీఆర్ఎస్ ఎంపీలు తొలి రోజు నుంచే ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం (Central) వైఖరిని ప్రశ్నించారు. పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) సమాధానంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఉభయ సభల నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.