అమ్ములపొదిలో మరో నాలుగైదు అస్త్రాలు.. అవి బయటకు తీస్తే.. : కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ఫ్లోరైడ్ నీళ్లు, 75వేల చెరువుల ధ్వంసం.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు చాలా నష్టం జరిగిందన్నారు. నక్సలిజానికి.. అమాయకులు బలైపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సభలో కేసీఆర్ విపక్షాలపై నిప్పులు చెరిగారు.

news18-telugu
Updated: September 22, 2019, 1:37 PM IST
అమ్ములపొదిలో మరో నాలుగైదు అస్త్రాలు.. అవి బయటకు తీస్తే.. : కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ (Source: Twitter)
  • Share this:
తెలంగాణలో మరో రెండు దఫాలు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు సీఎం కేసీఆర్. తమ వద్ద మరో నాలుగైదు స్కీమ్స్‌కు ప్లాన్స్ ఉన్నాయని..అవి బయటకు తీస్తే ప్రతిపక్షాలు ఖతమ్ అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న సకల దుర్మార్గాలకు బ్రీడింగ్ సెంటర్ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళల అక్రమ రవాణా,డ్రగ్స్ సరఫరా వంటి అసాంఘీక శక్తులు సమాజంలోకి చొరబడ్డాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రతీ విషయంలో విమర్శలు గుప్పించడం వారికి అలవాటైపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్,బీజేపీ దొందూ దొందే అని.. వీరి వల్లే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల వల్లే దేశంలో పేదరికం పెరిగిపోయిందన్నారు.రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ఫ్లోరైడ్ నీళ్లు, 75వేల చెరువుల ధ్వంసం.. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు చాలా నష్టం జరిగిందన్నారు. నక్సలిజానికి.. అమాయకులు బలైపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సభలో కేసీఆర్ విపక్షాలపై నిప్పులు చెరిగారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కల్యాణ లక్ష్మి, 24 గంటల విద్యుత్,రైతులకు ఉచిత్ విద్యుత్,రూ.2వేల ఫించన్ వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ప్రజలకు మేలు చేసే పథకాలను అమలుచేస్తున్నామని చెప్పారు. తాము తీసుకురాబోయే నూతన రెవెన్యూ చట్టం కూడా దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని..మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని కాపీ కొట్టడం ఖాయమని అన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే తాము కూడా సహకరిస్తామని.. అంతే తప్ప అడ్డగోలు విమర్శలు సరికాదని సూచించారు.

ఈ సంవత్సరం రుణమాఫీపై రూ.6వేల కోట్లు పెట్టామని.. త్వరలోనే రైతులకు ఆ డబ్బు అందుతుందని చెప్పారు. అయితే ఆలోపు రైతులే తమ అప్పులు కట్టుకుంటే.. తర్వాత ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వారికి చేరుతుందన్నారు.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading