TRS VEMULAWADA MLA CHENNAMANENI RAMESH HAS GERMAN CITIZENSHIP CENTRE TELLS HIGH COURT BA
Chennamaneni Ramesh: చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడే, మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
చెన్నమనేని రమేశ్(ఫైల్ ఫోటో)
Chennamaneni Ramesh citizenship Row: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జర్మనీ పౌరసత్వాన్ని రమేష్ 2023 వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై హైకోర్టులో విచారణ జరిగింది. జర్మనీ పౌరసత్వాన్ని రమేష్ 2023 వరకు పొడిగించుకున్నారని కేంద్ర హోం శాఖ హైకోర్టుకు తెలిపింది. అయితే, దీన్ని అఫిడవిట్ రూపంలో కాకుండా మెమో రూపంలో వివరాలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వంపై చాలా రోజులుగా వివాదం కొనసాగుతోంది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడని, ఆయన భారత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు కాబట్టి, ఆయన ఎన్నికను కొట్టివేయాలంటూ ఆది శ్రీనివాస్ అనే నాయకుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చాలా రోజుల నుంచి విచారణ జరుగుతోంది.
జర్మనీ పౌరసత్వ ఆరోపణలు, పాస్ పోర్టు ఉపయోగించారన్న అభియోగం పైన చెన్నమనేని తరఫు న్యాయవాదులు అఫిడవిట్, వాదనల రూపంలొ స్పందించారు. 12 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 3, 2009 లో భారత పౌరసత్వాన్ని పొందిన ధ్రువీకరణ పత్రాలను జర్మనీలోని అధికారిక సంస్థలకు అందించిన లేఖతో పాటు ఆ అధికారిక సంస్థ ఆమోదం తెలిపిన పాత, కొత్త డాక్యుమెంటు వాటి తర్జుమాలను చెన్నమనేని తరఫున న్యాయవాదులు హైకోర్టు లొ దాఖలు చేసారు. 1993 లొ చెన్నమనేని స్వచ్చందంగా జర్మని పౌరసత్వం తీసుకున్నప్పుడు భారత పౌరసత్వం ఎలాగయితే కోల్పోయారో, అదేవిధంగా 2009లో మళ్లీ స్వచ్చందంగా భారత పౌరసత్వం తీసుకున్నప్పుడు జర్మనీ పౌరసత్వాన్ని కోల్పోయారని చెప్పారు. చెన్నమనేని కి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణలకు జర్మనీ నుంచి ఆధారాలు తేవాలన్న హైకోర్టు ఆదేశాలను హోంశాఖ నెరవేర్చలేదు. ఈ విషయం పై హైకోర్టు హోంశాఖను తీవ్రంగా తప్పు పట్టింది. తాను కోరింది పాత మెమోలు కాదని వచ్చె నెల 20 వ తేది వరకు మొత్తం సమాచారం తొ రావాలని ఆదేశించింది. అధికారులు జర్మనీ కాన్సులేట్‌కు లేఖ రాసి వివరాలు కూడా తీసుకోలేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇంక అధికారాలు ఎందుకని ఆఫీసర్స్‌ను ప్రశ్నించింది. దీంతోపాటు అఫిడవిట్ దాఖలు చేయకుండా మెమో దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు చెన్నమనేని రమేష్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. కరోనా కాలంలోనూ కంటికి నిపించడంలేదని మండిపడుతూ వేములవాడలో బిక్షాటన చేశారు. నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడలేకపోవడంతో నిరసన తెలియజేశారు. ప్రజల ఓట్లతో గెలిసి.. జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ఇలా వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.