Home /News /politics /

TRS UNHAPPY WITH GHMC MAYOR VIJAYALAKSHMI WORKING STYLE HER FATHER K KESHAVA RAO TOOK KEY ROLE AK

GHMC: జీహెచ్ఎంసీ మేయర్‌ తీరుపై టీఆర్ఎస్‌లో అసంతృప్తి.. రంగంలోకి దిగిన సీనియర్ నేత

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం

Telangana: సీనియర్ నేత కే.కేశవరావు రాజకీయ వారసురాలు, ఉన్నత విద్యార్హత కలిగిన విజయలక్ష్మి.. జీహెచ్ఎంసీ మేయర్‌గా తనదైన మార్కు చూపిస్తారని చాలామంది అనుకున్నారు.

    జీహెచ్ఎంసీలో మరోసారి ఎలాగోలా అధికారం దక్కించుకున్న అధికార టీఆర్ఎస్.. ఈసారి మేయర్ పదవిని పార్టీ సీనియర్ నేత, ఎంపీ కే.కేశవరావు కూతురు బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీకి కట్టబెట్టింది. విజయలక్ష్మీతో పాటు మరికొందరు మహిళా కార్పొరేటర్ల పేర్లు మేయర్ రేసులో వినిపించినా.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారి విజయలక్ష్మికి అవకాశం కల్పించారు. సీనియర్ నేత కే.కేశవరావు రాజకీయ వారసురాలు, ఉన్నత విద్యార్హత కలిగిన విజయలక్ష్మి.. జీహెచ్ఎంసీ మేయర్‌గా తనదైన మార్కు చూపిస్తారని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే అసలు విజయలక్ష్మి వ్యవహారశైలి కూడా టీఆర్ఎస్ అధిష్టానానికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారితో విజయలక్ష్మి మాట్లాడిన తీరు ఆయనను కలిచివేసిందట. దీంతో ఈ విషయాన్ని ఆయన మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

    ఇక నగరానికి చెందిన ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా విజయలక్ష్మి తన సన్నిహితుల విషయంలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఈ విషయాన్ని ఆయన మంత్రి కేటీఆర్‌కు వివరించారని తెలుస్తోంది. విజయలక్ష్మి తీరుపై అటు అధికారులు, ఇటు టీఆర్ఎస్ నేతల నుంచి ఫిర్యాదులు రావడంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. దీనిపై పార్టీ సెక్రటరీ జనరల్, విజయలక్ష్మి తండ్రి కే. కేశవరావుతో చర్చించారని తెలుస్తోంది. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని.. విజయలక్ష్మి వ్యవహారశైలి మారేలా చూడాలని ఆయన కేకేను కోరారని సమాచారం. అయితే దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టిన టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు.. జీహెచ్ఎంసీ అంశాలపై తాను స్వయంగా దృష్టి పెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఒకరకంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో మేయర్ తీసుకునే నిర్ణయాలను ఆయన ముందుగానే సమీక్షిస్తున్నారని.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. కేకే స్వయంగా రంగంలోకి దిగి నిర్ణయాలు తీసుకుంటుండటంతో.. టీఆర్ఎస్ నాయకత్వం కూడా ఈ విషయంలో కూల్ అయినట్టు సమాచారం. మొత్తానికి జీహెచ్ఎంసీ కొత్త మేయర్ తీరు.. ఆ పార్టీ అధిష్టానానికి కొంతమేర ఇబ్బందులు తెచ్చిపెట్టినట్టే కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: GHMC, Hyderabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు