కేంద్రానికి కేసీఆర్ ఝలక్... ఆ బిల్లుకు వ్యతిరేకం

కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎంపీలను ఆదేశించారు.

news18-telugu
Updated: December 9, 2019, 1:22 PM IST
కేంద్రానికి కేసీఆర్ ఝలక్... ఆ బిల్లుకు వ్యతిరేకం
నరేంద్ర మోదీ, కేసీఆర్
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమ ఎంపీలకు టీఆర్‌ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్ఆర్సీ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం... నేడే ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయించుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. బిల్లుపై చర్చ అనంతరం దీనిపై ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పార్టీ అధిష్టానం ఎంపీలకు విప్ జారీ చేసింది.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>