కేసీఆర్ ప్లాన్ మారిందా... అందుకే ఆ ప్రక్రియ ఆగిపోయిందా ?

KCR may join Congress alliance | తెలంగాణ అసెంబ్లీలోని టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవాలని భావించిన కేసీఆర్... ఇందుకోసం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చించుకున్నారని కొద్దిరోజుల క్రితం వరకు వార్తలు వినిపించాయి.

news18-telugu
Updated: May 18, 2019, 11:36 AM IST
కేసీఆర్ ప్లాన్ మారిందా... అందుకే ఆ ప్రక్రియ ఆగిపోయిందా ?
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్( ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో కేసీఆర్ మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై రాజకీయవర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నింటిని కలుపుకుని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నా... ఆయనతో కలిసి వచ్చేందుకు పలు ప్రాంతీయ పార్టీలు ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల తరువాత కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తే... వారి కూటమిలో చేరేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సైతం ఆయన సుముఖంగానే ఉన్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేసీఆర్ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలోని టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకోవాలని భావించిన కేసీఆర్... ఇందుకోసం పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చించుకున్నారని కొద్దిరోజుల క్రితం వరకు వార్తలు వినిపించాయి. టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి తమ పార్టీ ఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడానికి లేఖ కూడా ఇవ్వబోతున్నారనే ఊహాగానాలు కూడా బలంగా వినిపించాయి.

అయితే అంతలోనే ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇందుకు అసలు కారణం కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండటమే అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్‌ ఎల్పీలో విలీనం చేసుకుంటే భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేసే అవకాశం ఉండదని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు... ఇలా చేయడం వల్ల కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవనే భావనలో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ బిగ్ రిలీఫ్ ఇచ్చారనే వార్తలు రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...