ఎమ్మెల్యేలకు కేసీఆర్ కొత్త టార్గెట్... నేతల్లో టెన్షన్

తెలంగాణలోని మొత్తం 32 జడ్పీ చైర్మన్లను గెలుచుకోవడమే పార్టీ లక్ష్యమని నేతలకు స్పష్టం చేసిన కేసీఆర్... ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు హెచ్చరికతో కూడిన సూచనలు చేసినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: April 17, 2019, 4:52 PM IST
ఎమ్మెల్యేలకు కేసీఆర్ కొత్త టార్గెట్... నేతల్లో టెన్షన్
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్( ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 17, 2019, 4:52 PM IST
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయని రిలాక్స్ అవుతున్న ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త టార్గెట్ పెట్టినట్టు రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించిన గులాబీ బాస్... త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అని తేల్చి చెప్పారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు సూచించిన కేసీఆర్... ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం సాధించేలా కృషి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఎక్కువగా ఉందని కేసీఆర్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

తెలంగాణలోని మొత్తం 32 జడ్పీ చైర్మన్లను గెలుచుకోవడమే పార్టీ లక్ష్యమని నేతలకు మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్... ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు హెచ్చరికతో కూడిన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో నేతలకు ఇచ్చే అవకాశాలకు ఈ అంశాలనే ప్రాతిపదిక తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం పని చేస్తే... మంచి గుర్తింపుతో పాటు భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయనే విషయాన్ని అంతా గుర్తు పెట్టుకోవాలని కేసీఆర్ సూటిగానే చెప్పినట్టు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు, సీనియర్ నేతలు, ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎమ్మెల్యేలకు సూచించిన కేసీఆర్... ఏమైనా సమస్యలు ఉంటే ముందుగానే తన దృష్టికి తీసుకురావాలని పార్టీ నేతలకు వివరించారని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని ఓటమికి కారణాలు వినేందుకు తాను సిద్ధంగా లేనని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. మొత్తానికి లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయని రిలాక్స్ అవుతున్న ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు కేసీఆర్ మరో పరీక్ష పెట్టినట్టు కనిపిస్తోంది.First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...