ఆర్టీసీ కార్మికులతో చర్చలు... ఆ ఒక్కటి అడగొద్దన్న టీఆర్ఎస్ ముఖ్యనేత

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని టీఆర్ఎస్ ముఖ్యనేత కే.కేశవరావు కోరారు.

news18-telugu
Updated: October 14, 2019, 11:45 AM IST
ఆర్టీసీ కార్మికులతో చర్చలు... ఆ ఒక్కటి అడగొద్దన్న టీఆర్ఎస్ ముఖ్యనేత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను ఎంతగానో భాదించాయన్న కేకే... ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపవని అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ప్రతికా ప్రకటన విడుదల చశారు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేకే కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించిందని తెలిపారు.

44 శాతం ఫిట్‌మెంట్ ,16 శాతం ఐ ఆర్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని కేకే గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని... అందుకు ఆయనను అభినందిస్తున్నానని తెలిపారు. అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజి క్యారేజీల విషయంలో కేసీఆర్ ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని కోరారు.

తాను 2018 అసెంబ్లీ ఎన్నికల టిఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నానన్న కేకే... ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదని అన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొనలేదని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే ప్రభుత్వ విధానాన్ని మార్చుకోవాలని కోరడమే అని కేకే అన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని స్పష్టం చేశారు.
First published: October 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading