కేసీఆర్ కేబినెట్‌లోకి హరీశ్ రావు... ఏ శాఖ ఇవ్వనున్నారో తెలుసా...

Harish Rao | వచ్చే నెలలో కేబినెట్‌ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్... హరీశ్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 27, 2019, 3:34 PM IST
కేసీఆర్ కేబినెట్‌లోకి హరీశ్ రావు... ఏ శాఖ ఇవ్వనున్నారో తెలుసా...
హరీశ్ రావు (File)
  • Share this:
టీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీమంత్రి హరీశ్ రావు మళ్లీ కేసీఆర్ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్... కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరినీ తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జూలై మొదటివారంలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారని... కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మరో నలుగురికి కేబినెట్‌లో చోటు కల్పించాలని ఆయన డిసైడయ్యారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేబినెట్‌లో మొత్తం ఆరు ఖాళీలు ఉన్నాయి.

వారిలో కేటీఆర్, హరీశ్ రావు బెర్త్‌లు పోగా... మరో నాలుగు ఖాళీలు ఉంటాయి. అయితే ఈ సారి కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తానంటూ కేసీఆర్ అసెంబ్లీలోనూ ప్రకటించారు. మాజీమంత్రి, కాంగ్రెస్ తరపున గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డితో పాటు మరో మహిళకు కేబినెట్‌లో చోటు దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక కేబినెట్‌లో ఖమ్మం జిల్లాకు ప్రస్తుతం ప్రాతినిథ్యం లేదు. దీంతో ఈ సారి జరగబోయే కేబినెట్ విస్తరణలో ఖమ్మం నుంచి కచ్చితంగా ఒకరికి చోటు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేసిందని... టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావుపై కన్నేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే కేసీఆర్ హరీశ్ రావును కేబినెట్‌లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక గతంలో హరీశ్ రావు కీలకమైన సాగునీటి పారుదల శాఖను నిర్వహించగా... ఈ సారి మాత్రం ఆయనకు ఆ శాఖకు బదులుగా విద్యాశాఖను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.


First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు