ఉమ్మడి ఆదిలాబాద్‌లో మరోసారి పట్టునిలుపుకొన్న టీఆర్ఎస్

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ మరో సారి ఆధిక్యతను నిలుపుకుంది.

news18-telugu
Updated: January 25, 2020, 10:08 PM IST
ఉమ్మడి ఆదిలాబాద్‌లో మరోసారి పట్టునిలుపుకొన్న టీఆర్ఎస్
తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ మరో సారి ఆధిక్యతను నిలుపుకుంది. 11మున్సిపాలిటీలకు 8 అధికార పార్టీ ఖాతాలోకి రాగా ఒకచోట ఎం.ఐ.ఎం దక్కించుకుంది. మరో రెండు చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడం తో పుర పీఠం ఏ పార్టీకి దక్కనుంది అన్న ఉత్కంఠ నెలకొంది.

మున్సిపల్ ఎన్నికల పర్వంలో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా.. ప్రశాంతం గా ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11మున్సిపాలిటీలకు ఈ నెల 22న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపు క్షణ క్షణం ఉత్కంఠ భరితంగా సాగింది . రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఏకైకమున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రం లోని టీటిడిసి లో జరగగ్గా...కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపాలిటి ఓట్ల లెక్కింపు కగజ్ నగర్ లో.. నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నిర్మల్ లో...మంచిర్యాల జిల్లాలోని ఆరు మున్సిపాలిటిల ఓట్ల లెక్కింపు మంచిర్యాలలో కట్టు దిట్టమైన ఏర్పాట్ల నడుమ కొనసాగింది.

49 స్థానాలు ఉన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 24 స్థానాలను టీఆర్ఎస్..11 బిజెపి.5 ఎం.ఐ.ఎం.5 కాంగ్రెస్.. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందారు. 30 స్థానాలున్న కాగాజ్ నగర్ లో అధికార టీఆరెఎస్ 22, కాంగ్రెస్ 6, ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలుపొందారు. భైంసా లో 26 స్థానాలకు ఎంఐఎం 15, బిజెపి 9 స్వతంత్రులు 2 స్థానాలను దక్కించుకున్నారు. దీంతో భైంసా పీఠం ఎంఐఎం వశమైంది.

నిర్మల్, మంచిర్యాల, లక్సేట్టిపేట, కక్యాతన్ పల్లీ, బెల్లం పల్లీ, చెన్నూర్ మున్సిపాలి టీల్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీని సాధించి మున్సిపల్ పీఠాలను దక్కించుకుంది. ఖానాపూర్ లో 12 స్థానాలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో అయిదు స్థానాల్లో గెలుపొందగా బిజెపి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానం లో గెలుపొందారు. దీంతో పీఠం ఎవరిదొనన్న సందిగ్ధత నెలకొంది. అయితే స్వతంత్ర అభ్యర్థికి గాలం వేసేందుకు టిఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి.

కాగా 25 స్థానాలు ఉన్న నస్పూర్ లో టీఆర్ఎస్ 10. కాంగ్రెస్ 6, బిజెపి 3, సిపిఐ 2, ఫార్వర్డ్ బ్లాక్ ఒకటి, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఇక్కడ కూడా ఉత్కంఠ నెలకొంది.

(కట్టా లెనిన్, ఆదిలాబాద్ జిల్లా, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: January 25, 2020, 10:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading