news18-telugu
Updated: November 18, 2020, 8:52 PM IST
కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తమ పార్టీ తరపున 29 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మందితో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కలిసొచ్చేలా 105 మందితో తొలి జాబితా సంఖ్యను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది సిట్టింగ్‌లకు తిరిగి టికెట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా
గ్రేటర్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న టీఆర్ఎస్... పనితీరు సరిగ్గా లేని వారికి ఈసారి మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దని గట్టి నిర్ణయానికి వచ్చింది. అందుకే పనితీరు సరిగ్గా లేని అభ్యర్థులకు సంబంధించిన టికెట్లకు మొదటి జాబితాలో పెండింగ్‌లో పెట్టినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
Published by:
Kishore Akkaladevi
First published:
November 18, 2020, 8:52 PM IST