GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థుల రెండో లిస్ట్, కొందరు సిట్టింగ్‌లకు షాక్

మొదటి జాబితాలో సెంటిమెంట్‌గా 105 మందితో లిస్ట్ రిలీజ్ చేసిన టీఆర్ఎస్ పెద్దలు, రెండో జాబితాలో మరో 25 మందికి టికెట్లు ఖరారు చేశారు.

news18-telugu
Updated: November 19, 2020, 6:09 PM IST
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థుల రెండో లిస్ట్, కొందరు సిట్టింగ్‌లకు షాక్
కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను అధికార టీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. 20 మంది అభ్యర్థులతో రెండో లిస్టు ఇచ్చింది. మొదటి జాబితాలో సెంటిమెంట్‌గా 105 మందితో లిస్ట్ రిలీజ్ చేసిన టీఆర్ఎస్ పెద్దలు, రెండో జాబితాలో మరో 25 మందికి టికెట్లు ఖరారు చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్టు అయింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో సింగల్‌గానే పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో మరో 25 మంది అభ్యర్థులను ప్రకటించనుంది. మరోవైపు తాజాగా ప్రకటించిన జాబితాలో కొందరు సిట్టింగ్‌లను పక్కన పెట్టి కొత్తవారికి టికెట్లు ఖరారు చేసింది. మైలార్‌ దేవ్‌పల్లి సిట్టింగ్‌ కార్పోరేటర్‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరడంతో.. అక్కడ ప్రేమదాస్‌గౌడ్‌కు ఛాన్స్‌ ఇచ్చింది. అటు బాలానగర్‌ సిట్టింగ్‌ సీటు నరేంద్రాచార్యాను మార్చి... ఆవుల రవీందర్‌రెడ్డికి అవకాశం ఇచ్చింది. 122వ వార్డు వివేకానందనగర్‌ సిట్టింగ్‌ సీటు సైతం మార్చారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు... మూడు సిట్టింగ్‌ సీట్లను పట్టుబట్టి మార్పించినట్లు తెలుస్తోంది. అడ్డగుట్ట, మెట్టుగూడ, బౌద్దనగర్‌లో సిట్టింగ్‌ సీట్లను మార్చారు. ఇక.. 149వ వార్డు బేగంపేట సిట్టింగ్‌ సీటును సైతం మార్చింది.

మరోవైపు యూసఫ్‌గూడ, వెంగళరావునగర్‌, రెహ్మత్‌నగర్‌ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. యూసఫ్‌గూడాలో సంజయ్‌, వెంగళరావునగర్‌లో కిలారీ మనోహర్‌లపై ఎమ్మెల్యే మాగంటిగోపినాథ్‌ తీవ్ర అసంతృప్తి ఉండటంతో... వీటిని పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఉప్పల్‌ బేతి సుభాష్‌రెడ్డి నియోజకవర్గంలోనూ... ఏడు సీట్లు పెండింగ్‌లో పెట్టింది టీఆర్‌ఎస్‌. నాచారం, హబ్సీగూడ, ఉప్పల్‌, చర్లపల్లి, చిలకనగర్‌, హౌసింగ్‌బోర్డు, ఎఎస్‌రావునగర్‌ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నాచారంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన శాంతి సాయిజన్‌ శేఖర్‌... ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి ఓడిన మేడల జ్యోతి మల్లికార్జున సైతం సీటు ఆశిస్తుండటంతో... ఈ సీటును పెండింగ్‌లో పెట్టింది గులాబీ పార్టీ.

GHMC Elections TRS Second List:


ఇక మేయర్‌ పోటీలో ఉన్న బొంతు రామ్మోహన్‌ భార్య సైతం.. చర్లపల్లి సీటు ఆశిస్తుండంటంతో.. దీన్ని కూడా పెండింగ్‌లో పెట్టింది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ నియోజకవర్గంలో...నల్లకుంట, అంబర్‌పేట, అడిక్ మెట్, గోల్నాక, కాచిగూడ, కవాడిగూడ, ముషీరాబాద్‌ స్థానాలు పెండింగ్‌లో పెట్టారు.

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. 99 మంది కార్పొరేట్లు గెలుపొందారు. సొంతంగానే మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈ సారి కూడా అదే స్థాయిలో ఫలితాలు రావాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అప్పగించారు. డివిజన్ల వారీగా ఈ ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆదేశించారు. అన్ని సర్వేలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఇన్ చార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో బల్దియాపై గులాబీ జెండా ఎగరేసి ‘నాన్నకు ప్రేమతో’ గిఫ్ట్ ఇచ్చిన కేటీఆర్ ఈసారి కూడా అదే జోష్ కొనసాగించాలని స్పష్టం చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 19, 2020, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading