Home /News /politics /

TRS REBEL SARDAR RAVINDER SINGH SLAMS CM KCR AMID KARIMNAGAR MLC ELECTIONS MKS KNR

karimnagar mlc : టీఆర్ఎస్‌లో సరికొత్త వర్గం -అర్జున గుట్ట పుష్కరాల సాక్షిగా kcr: సర్దార్ తాజా బాంబు

సీఎం కేసీఆర్ తో సర్దార్ రవీందర్ సింగ్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ తో సర్దార్ రవీందర్ సింగ్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ పై తిరుగుబావుటా ఎగరేసిన సర్దార్.. ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో సాధించిన ఫలితాన్నే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ చేస్తారనే అంచనాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన..

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకోడానికి గులాబీ దళం ప్రయత్నించినా, 6మాత్రమే దక్కి, మిగతా 6చోట్ల ఎన్నిక అనివార్యమైంది. అన్నిటిలోకీ, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడి రెండు స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, టి.భానుప్రసాద్ సహా మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందరిలోకి కరీంనగర్ మాజీ మేయర్, ​టీఆర్​ఎస్​ తిరుగుబాటు నాయకుడు​ సర్దార్​ రవీందర్​ సింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ (CM KCR) పై తిరుగుబావుటా ఎగరేసిన సర్దార్.. ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో సాధించిన ఫలితాన్నే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ చేస్తారనే అంచనాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ లో ఉద్భవించిన సరికొత్త వర్గం, సీఎం కేసీఆర్ పోకడలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

యూటీ, బీటీ బ్యాచ్ కాదు, కొత్త వర్గం
టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడొక సరికొత్త వర్గం పుట్టుకొచ్చింది. ఇప్పటిదాకా పార్టీలో.. ఉద్యమ తెలంగాణ (యూటీ) బ్యాచ్ , బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్ కాకుండా కొత్తగా మెయింటనెన్స్ బ్యాచ్(ఎంటీ) కూడా మొదలయిందని, తప్పుడు పద్దతులు, అక్రమ మార్గాల్లో ఎన్నికలను మేనేజ్ చేయడమే ఈ కొత్త బ్యాచ్ పని అని, కరీంనగర్ లో ఎమ్మెల్సీ స్థానానికి తన నామినేషన్ ను కూడా అడ్డుకోవాలని ఈ బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నించిందని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. తన నామినేషన్ ను తిరస్కరించే ప్రయత్నం జరిగిందని, తనకు మద్దతిచ్చినవాళ్లపై టీఆర్ఎస్ సర్కారు అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టిందని సింగ్ తెలిపారు.

karimnagar mlc : టీఆర్ఎస్‌కు షాక్! -రెబల్ సర్దార్ రవీంద్ సింగ్‌ గెలుపు? -ఆయన చెప్పినవన్నీ జరిగాయి మరి!!పుష్కరాల సాక్షిగా కేసీఆర్..
‘రిటర్నింగ్ అధికారి 3 గంటలపాటు నన్ను ఇబ్బందులకు గురిచేశారు. నా నామినేషన్ చూసి టీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురవుతున్నారా? ఎన్నికల్లో పోటీలో ఉంటున్న అని చెప్పడానికే నేను ఫోన్ స్విచాఫ్ చేశాను. చట్టసభలో ప్రతినిధిగా ఉండాలనే నేను బరిలోకి దిగాను. నిజానికి నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ ఎన్నిసార్లు మాటిచ్చాడో తెలుసా? (మంచిర్యాల జిల్లాలోని) అర్జున గుట్ట పుష్కరాల సాక్షిగా నాకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ 15 ఏళ్ల క్రితం వాగ్ధానం చేశాడు. ఆ తర్వాత, మహబూబ్ నగర్ ఉపఎన్నికల సందర్బంలో, మరోసారి నాయిని నరసింహ రెడ్డి, పల్లె రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిల సమక్షంలోనూ అదే మాట చెప్పారు. కానీ పదే పదే మాట తప్పడం ఆయనకు రివాజుగా మారింది. నాకు పదవి ఇవ్వకున్నా పర్వాలేదు కానీ..

pic of the day : విరోధులు ఒక్కటైన వేళ -వరి దీక్షలో రేవంత్-కోమటిరెడ్డి నవ్వులు -దీని వెనుక ఎవరంటే -photos


వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ అవసరమా?
ఏనాడూ జై తెలంగాణ అననివాళ్లకు, ఉద్యమ ద్రోహులకు పిలిచిమరీ కేసీఆర్ టికెట్లు ఇవ్వడం ఉద్యమకారులను అవమానించినట్లే. కరీంనగర్ మంత్రులు ఉద్యమకారుల్ని అవమానాలకు గురిచేస్తున్నారు. భానుప్రసాద్, ఎల్.రమణలు కనీసం రెండు వారాలైనా కరీంనగర్ లో ఉన్నారా? ఏనాడైనా జై తెలంగాణ అన్నారా? ఎంపీటీసీ, జడ్పీటీసీల సమస్యలపై మాట్లాడారా? నిజం చెప్పాలంటే నా నామినేషన్ వల్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు గౌరవం దక్కింది. భయంతో టీఆర్ఎస్ వాళ్లందరినీ క్యాంపులకు తీసుకెళ్లింది. అయినాసరే వారంతా నాకే ఓటేస్తారని విశ్వాసం ఉంది. ఉద్యమం చేసినవాళ్లకు కాకుండా ఉద్యమాన్ని తిట్టినవాళ్లకు పదవులు దక్కడం అన్యాయం. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులే లేనట్టు.. కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని రాజీనామా చేయించి, 24 గంటల్లోనే పదవి ఇవ్వడం అవసరమా? కరీంనగర్ మేయర్ గా, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నేను చేసిన మంచి పనులే నన్ను గెలిపిస్తాయి. టీఆర్ఎస్ బండారాలు రోజుకొకటి చొప్పున బయటపెడతా’అని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Karimnagar, Mlc elections, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు