కేసీఆర్ ఆ సీనియర్ నేతను పక్కన పెట్టేస్తారా.. కవితకు ఛాన్స్..?

టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలు ఎవరు? అనే ప్రశ్నపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఏప్రిల్‌లో ఖాళీ అవుతాయి.

news18-telugu
Updated: February 21, 2020, 7:55 AM IST
కేసీఆర్ ఆ సీనియర్ నేతను పక్కన పెట్టేస్తారా.. కవితకు ఛాన్స్..?
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే నేతలు ఎవరు? అనే ప్రశ్నపైనే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఏప్రిల్‌లో ఖాళీ అవుతాయి. రాష్ట్రం నుంచి రిటైర్‌ అవుతున్న రాజ్యసభ సభ్యుల జాబితాలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేవీపీ రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎన్నికై ప్రస్తుతం బీజేపీలో ఉన్న గరికపాటి మోహన్‌రావు ఉన్నారు. వీరిద్దరి పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఆ రెండు సీట్లకు ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో ఆశావహులు ప్రగతి భవన్‌కు క్యూ కడుతున్నారు. అయితే, రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ కోటా కిందకు వెళ్లిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం నేత కె.కేశవరావు కూడా రిటైర్‌ అవుతున్నారు. మరి ఆయన్ను సీఎం కేసీఆర్ పక్కన పెట్టేస్తారా? లేదా మళ్లీ రాజ్యసభ అవకాశం కల్పిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ ఎంపీలకు ఈసారి ఛాన్స్‌ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఆ రేసులో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వినోద్‌ కుమార్‌, కవిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం సీటును పొంగులేటికి ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారట. దీంతో.. ఒక సీటు ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మాజీ ఎంపీ కవితను పెద్దల సభకు పంపాలని నిజామాబాద్ జిల్లా నేతలు కేసీఆర్‌కు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ జిల్లా నుంచి మాజీ స్పీకర్ సురేశ్​రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్​రావు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు సీట్లలో కేకేకు అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది చూడాలి. మరోవైపు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బూర నర్సయ్య గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కూడా రాజ్యసభ సీటు కోసం తెగ ట్రై చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

కాగా, టీఆర్ఎస్​ నుంచి ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యసభ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఈసారి అవకాశం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ లీడర్లు సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. ఎస్సీ నుంచి మందా జగన్నాథం, ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి.. సీఎం కేసీఆర్ ఎవరిని పెద్దల సభకు పంపుతారో..!

ఇదిలా ఉండగా, అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు ఉన్న సంఖ్యా బలం పరంగా 2 స్థానాలు ఆ పార్టీకే దక్కనున్నాయి. 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 104, ఎంఐఎంకు 7, కాంగ్రెస్‌కు 6, టీడీపీ, బీజేపీకి ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు. అధికార పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని(7) రాజ్యసభ స్థానాలు గులాబీ పార్టీ ఖాతాలో చేరబోతున్నాయి.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు