స్ట్రాంగ్‌రూంలో టీఆర్ఎస్ కార్యకర్త... ఏం చేశాడంటే...

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచిన చోట, టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు హల్ చల్ చేశారు.

news18-telugu
Updated: April 14, 2019, 1:59 PM IST
స్ట్రాంగ్‌రూంలో టీఆర్ఎస్ కార్యకర్త... ఏం చేశాడంటే...
ఈవీఎంలో టీఆర్ఎస్ కార్యకర్త ఫోటో
  • Share this:
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల తరలింపు, భద్రతలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోదాములకు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను తీసుకొచ్చే.. తీసుకెళ్లే కదలికలను, భద్రతపై ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని సీఈసీ ఆదేశించినట్టు సీఈవో రజత్‌కుమార్ తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచిన చోట, టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు హల్ చల్ చేశారు. ఈవీఎంలతో సెల్ఫీ దిగి, వీడియో తీసుకోవడం, అవి బయటకు వచ్చి వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖరరెడ్డికి పోలింగ్ ఏజంట్‌గా ఎన్ వెంకటేశ్ అనే వ్యక్తి వ్యవహరించాడు.

తొలి దశ పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను హోలీ మేరే కాలేజ్ లో భద్రపరుస్తుండటంతో వెంకటేశ్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఫోటోలు దిగి, వీడియో తీసుకున్నాడు. చట్టవిరుద్ధంగా స్ట్రాంగ్ రూములో వీడియో, ఫోటోలు తీశారని కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మల్కాజిగిరిలో ఈ సారి త్రిముఖ పోటీ నెలకొంది. మర్రి రాజశేఖరరెడ్డికి పోటీగా కాంగ్రెస్ నుంచి ఏ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు పోటీలో ఉన్నారు. వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్‌, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.

మరోవైపు ఈవీఎంలు భద్రపరిచిన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనం సమీపంలో ప్రహరీ గోడకు ఆవతల శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ పెరిగిన పిచ్చిమొక్కలు, ఎండుగడ్డిలో గుర్తు తెలియని వ్యక్తులు బీడీ కాల్చి పారేయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది. దీంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: April 14, 2019, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading