TRS PLANNING TO GIVE POSTS TO LEADERS WHO IS THERE FROM TELANGANA AGITATION FROM PARTY AK
BJP ఎఫెక్ట్.. నేతలకు పదవులు ఇచ్చే యోచనలో KCR.. వాళ్లకే మొదటి ప్రాధాన్యత
నరేంద్రమోదీ, కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana: కొన్నేళ్ల నుంచి వీటిని భర్తీ చేసే విషయంలో గులాబీ బాస్ తాత్సారం చేస్తున్నారనే అసంతృప్తి టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ నాయకత్వం చెబుతూనే వస్తున్నా.. ఆచరణలో మాత్రం అలా జరగడం లేదు.
తెలంగాణలో రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత టీఆర్ఎస్పై రాజకీయ పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని భావించిన బీజేపీ.. ఈ క్రమంలో తెలంగాణలో తమ బలం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్కు బీజేపీ బలమైన పోటీ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఇతర పార్టీల్లోకి బలమైన నేతలకు ముందే ఇతర పార్టీల్లోని ఉద్యమకారులను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఈటల రాజేందర్ ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేయాలని ఆ పార్టీ నాయకత్వానికి సూచించారని.. ఇందుకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని టాక్ వినిపిస్తోంది.
ఇటీవల తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఉద్యోగుల సంఘం నాయకుడు విఠల్.. బీజేపీలో చేరడం ఇందులో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ వ్యూహాన్ని అంచనా వేసిన అధికార టీఆర్ఎస్.. ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతలకు.. త్వరలోనే రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా గులాబీ పార్టీ నాయకత్వం సమాలోచనలు చేస్తోందని చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత.. పార్టీతో పాటు తెలంగాణ సమాజంలో ఉన్న ఉద్యమకారులను గుర్తించి వారికి తగు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ అండ్ కో భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు టీఆర్ఎస్లో ఉద్యమ సమయం నాటి నుంచి ఉంటూ... అసంతృప్తితో ఉన్న నేతలను గుర్తించే పనిలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముందుగా అలాంటి వారిని గుర్తించి.. వాళ్లు పార్టీ వీడకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
తెలంగాణలోని వివిధ కార్పొరేషన్లలో అనేక పదవులు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి వీటిని భర్తీ చేసే విషయంలో గులాబీ బాస్ తాత్సారం చేస్తున్నారనే అసంతృప్తి టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఈ పదవులను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ నాయకత్వం చెబుతూనే వస్తున్నా.. ఆచరణలో మాత్రం అలా జరగడం లేదు. అయితే తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో..ఇప్పుడు టీఆర్ఎస్ ఆ పదవులను భర్తీ చేసే అంశంపై సీరియస్గా దృష్టి పెట్టిందని.. అందులోనూ ఉద్యమకారులకే ఫస్ట్ ప్రయారిటీ అని డిసైడయ్యిందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.