తెలంగాణలో టీఆర్ఎస్ కొత్త టార్గెట్.. ఈసారి 32 సీట్లే లక్ష్యం

మొత్తం 32 జిల్లాలకు గాను 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ గెలవడం ఖాయమని కేటీఆర్ అన్నారు.

news18-telugu
Updated: April 13, 2019, 7:09 PM IST
తెలంగాణలో టీఆర్ఎస్ కొత్త టార్గెట్.. ఈసారి 32 సీట్లే లక్ష్యం
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
news18-telugu
Updated: April 13, 2019, 7:09 PM IST
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మరో టార్గెట్ పెట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో 32 జెడ్పీస్థానాలు కైవసం చేయాలని నిర్ణయించింది. రాబోయే రోజుల్లో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. పార్టీ శ్రేణులకు కేసీఆర్ సోమవారం దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. మొత్తం 32 జిల్లాలకు గాను 32 జెడ్పీ చైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ గెలవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. దీంతోపాటు ఎన్నికలు జరగనున్న సుమారు 530కి పైగా ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైందని, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలకు నిరాశ తప్పదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లాలవారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కేటీఆర్ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు.

First published: April 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...