ఎన్నికల సిత్రాలు... గణనాధుడి మెడలో గులాబీ కండువా.. కవితపై నెటిజన్ల సెటైర్లు

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కండువాను ఏకంగా గణనాధుడి మెడలో వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: November 19, 2020, 10:27 PM IST
ఎన్నికల సిత్రాలు... గణనాధుడి మెడలో గులాబీ కండువా.. కవితపై నెటిజన్ల సెటైర్లు
వినాయకుడి మెడలో టీఆర్ఎస్ పార్టీ కండువా (Screen Grab)
  • Share this:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పలు చిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కండువాను ఏకంగా గణనాధుడి మెడలో వేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రావినూతల శశిధర్ అనే ఫేస్ బుక్ యూజర్ తన అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. 2.46 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో కవితతో పాటు కొందరు టీఆర్ఎస్ నాయకులు గుడిలో పూజలు చేశారు. ఆ సమయంలో ఓ టీఆర్ఎస్ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ కండువాను పూజారికి ఇచ్చారు. అక్కడున్న ఇద్దరు పూజారుల్లో ఒకరు ఆ కండువాను వినాయకుడి మెడలో వేశారు. దీనిపై బీజేపీ, వీహెచ్‌పీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుననారు. అలాగే, ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. కవితను MLC పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు టీఆర్ఎస్ పార్టీ మీద, కవిత మీద మంపడితున్నారు. దేవుడి గుడిలో కూడా రాజకీయాలు చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. మరికొందరు మాత్రం పూజారి తీరును తప్పుపడుతున్నారు. ఒకవేళ దేవుడి మీద భక్తితో ఎవరైనా ఓ వస్త్రం ఇస్తే దాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి తిరిగి ఇచ్చేయాలి కానీ, ఇలా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దేవుడి విగ్రహం మెడలో వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

డిసెంబర్ 1న జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 125 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 105, రెండో జాబితాలో మరో 20 మందితో లిస్ట్ రిలీజ్ చేసింది. అందులో కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు షాక్ ఇచ్చింది. కొన్ని కీలక ప్రాంతాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. గట్టి పోటీ ఉన్న ప్రాంతాల్లో చివరి నిమిషంలో అభ్యర్థులను ప్రకటించనుంది.

2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈసారి 100 మార్క్ దాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే, ఎన్నికల్లో టికెట్లు దక్కని ఆశావహుల నుంచి కొంత నిరసన ఎదురవుతోంది. ఈ క్రమంలో గులాబీ నేతలు కారు దిగి కాషాయ కండువా కప్పుకొంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు చెందిన మైలార్‌దేవర్ పల్లికి చెందిన కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్‌ఎస్‌కు చెందిన వెంగళరావునగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో వెంగళరావునగర్ బీజేపీ అభ్యర్థిగా కిలారి మనోహర్ నిలువనున్నట్టుగా తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు.. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు తీవ్రంగా మంతనాలు సాగిస్తున్నారు. వీలైనంత వరకు బలమైన నాయకులను పార్టీలో చేర్చుకని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చెందిన పలువురు నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 19, 2020, 10:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading