• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • TRS PARTY LEADERS JOINING IN TO YS SHARMILA NEW PARTY POLITICAL PARTIES EYE ON KHAMMAM DISTRICT HSN KMM

YS Sharmila Reddy: నేను జగనన్న వదిలిన బాణాన్ని కాదు.. కేసీఆర్‌తో కూడా సంబంధం లేదు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..

YS Sharmila Reddy: నేను జగనన్న వదిలిన బాణాన్ని కాదు.. కేసీఆర్‌తో కూడా సంబంధం లేదు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..

కేజీఆర్, జగన్, వైఎస్ షర్మిల (ఫైల్ ఫొటోలు)

ఏప్రిల్ నెల 9వ తేదీన ఖమ్మంలో వైఎస్‌ షర్మిల భారీ బహిరంగ సభ జరగనుంది. ఈమేరకు ఈ సభకు పోలీసుల నుంచి అనుమతి కూడా లభించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 • Share this:
  ఆ పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు. పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవలేదు. జెండా, అజెండా ఇంకా ఖరారు కానేలేదు. అయినా ఇంకా పెట్టని పార్టీలోకి ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. పైగా ఏదో అధికారంలేని పార్టీ నుంచి అనుకుంటే అది వేరు. పదవి లేని వాళ్లా అనుకుంటే అది కూడా వేరేలెక్క. కానీ ఇక్కడ వైఎస్‌ షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నది ఓ మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌. ఆమె పేరు శీలం విద్యాలత. ఉన్నది తెరాస పార్టీలో. రాష్ట్రంలో తెరాసకు ఇంకా మూడేళ్ల పాటు అధికారం ఉంది. విద్యాలతకు ఇంకా నాలుగేళ్లకు పైగా పదవికాలం ఉంది. అయినా ఆమె పార్టీ మారారు. వైఎస్‌ రాజశేఖరరరెడ్డి కుమార్తెగా ఆమె స్థాపించబోయే పార్టీలో మొదటి నుంచి పనిచేయాలని, ఆమె వెన్నంటి నడవాలన్నది విద్యాలత ఆలోచన.

  ఆమె భర్త శీలం వెంకటరెడ్డి భరత్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌. ఈమేరకు మీరిరువురూ వైఎస్‌ షర్మిలను మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో కలిశారు. ఈ సందర్భంగా తాము తెరాసకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజకీయంగా వైఎస్‌ షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయుల్లో బలంగా పాదుకుపోయిన తెరాసకు రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది చిన్న పరిణామమే. ఎక్కడో ఒక మున్సిపల్‌ వైస్ ఛైర్‌పర్సన్‌ పార్టీ నుంచి వెళ్లిపోతే అది పెద్ద విషయం కూడా కాకపోవచ్చు.
  ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

  కానీ అధికార పార్టీలో ఏదో ఒక చిన్న పదవి ఉంటే చాలు అనుకుంటున్న రోజుల్లో ఏకంగా మునిసిపల్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌ అయి ఉండి కూడా కొత్తగా పెట్టే పార్టీలోకి మారాలనుకోవడం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైఎస్ షర్మిల కూడా ఖమ్మం జిల్లాకు అధికా ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మొట్టమొదటి బహిరంగ సభను ఖమ్మంలోనే నిర్వహించాలని ఆమె నిర్ణయించారు. గతంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర విభజన అనంతరం కూడా ఈ జిల్లా నుంచి ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచిన విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాల్సి ఉంది. వచ్చే నెల 9వ తేదీన ఖమ్మంలో వైఎస్‌ షర్మిల భారీ బహిరంగ సభ జరగనుంది. ఈమేరకు ఈ సభకు పోలీసుల నుంచి అనుమతి కూడా లభించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల బహిరంగసభను దిగ్విజయం చేసేందుకు ఇప్పటికే పలు స్థాయిల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా ముఖ్య ప్రతినిధులతో మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో ఆమె సమావేశమయ్యారు. పార్టీ విధానాలు నిర్మాణం తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు.
  ఇది కూడా చదవండి: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!

  ఈ సందర్భంగానే ఖమ్మం జిల్లా పాలేరు నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జిల్లా నుంచి వచ్చిన నాయకులు కోరారు. అయితే దీనిపై షర్మిల ఏవిధమైన స్పందన కనబర్చలేదని చెబుతున్నారు. అయితే ఖమ్మం జిల్లా నుంచే పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నట్టు చెబుతున్నారు. లక్ష మందితో నిర్వహించే ఈ సమావేశం వేదికగానే తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్య స్థాపనపై తన ఆలోచనలను పూర్తి స్థాయిలో ప్రజలతో పంచుకుంటానని.. తాను జగనన్న లేదా కేసీఆర్‌లు వదలిన బాణాన్ని కాదనీ లేదంటే బీజేపీకో లేదా మరో పార్టీకో బీ టీం కాదని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. ఓ స్పష్టమైన ఆలోచనా విధానంతో సిద్ధాంతపరమైన స్పష్టతతో వస్తున్న పార్టీ అని వైఎస్‌ షర్మిల తనను కలసిన అభిమానులకు చెబుతున్నారు.
  ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

  చేరికలు ముమ్మరం..
  ఇప్పటికే వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలోకి చేరికలు ముమ్మరం అయిపోయాయి. ఇప్పటిదాకా ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వారంతా గుండుగుత్తగా షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న నాయకులు లక్కినేని సుధీర్, లక్కినేని సురేందర్‌, తదితరులకు తోడు మిగిలిన వారంతా ఇప్పటికే పలుమార్లు షర్మిలను కలిశారు. దీనికితోడు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారు సైతం ఆమెను కలిసి మద్దతు తెలుపుతున్నారు. ఖమ్మం సిటీ బిల్డర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తుంపాల కృష్ణమోహన్‌ మంగళవారం నాడు వైఎస్ షర్మిలను, ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ను కలిశారు.
  ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

  ఖమ్మంలోని క్రిస్టియన్‌ మైనారిటీలలో బాగా ప్రాబల్యం ఉన్న కృష్ణమోహన్‌ రాకతో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి స్పందన బాగుంటుందని అంచనావేస్తున్నారు. వచ్చే నెల 9న జరగనున్న షర్మిల బహిరంగసభను ఖమ్మంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు గత వారంలో కొండా రాఘవరెడ్డి ఖమ్మంలో పర్యటించారు. ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్నార్‌ కాలేజి గ్రౌండ్‌.. పటేల్‌ స్టేడియం, పెవిలియన్‌ గ్రౌండ్స్‌లలో ఒకదాన్ని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈమేరకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్టు చెబుతున్నారు. ఇక వచ్చే నెలలో వైఎస్‌ షర్మిల జిల్లాకు రానుండడంతో ఇప్పటికే ఆమెను ప్రత్యక్షంగా కలుసుకోడానికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈనెల 19న వందలాది కార్లలో వెళ్లి ఆమెను కలసి మద్దతు ప్రకటించాలని ఇక్కడి నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం మీద ఖమ్మంలో రాజకీయ కోలాహలం మాత్రం మొదలైనట్టు చెప్పుకోవచ్చు. ఈమేరకు ఆమెను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చేసే అభ్యర్థనల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతునే ఉంది. ఈ పరిణామాలపై అధికార తెరాస సహా ఇప్పటిదాకా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎలాంటి ఆసక్తి, స్పందన కనబర్చలేదు.
  ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!

  (న్యూస్ 18 తెలుగు- ఖమ్మం కరస్పాండెంట్‌ జి.శ్రీనివాసరెడ్డి)

  Published by:Hasaan Kandula
  First published:

  అగ్ర కథనాలు