Nomula Bhagath: 1984 అక్టోబర్ 10న జన్మించిన నోముల భగత్ భగత్ ఇంజినీరింగ్ చదివి ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం తన తండ్రి తరహాలోనే ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
తన తండ్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నోముల నర్సింహయ్య అకాల మరణంతో రాజకీయాల్లో వచ్చిన నోముల భగత్.. టీఆర్ఎస్ అభ్యర్థిగా సాగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ... కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై గెలిచారు. 2014లో టీఆర్ఎస్లో చేరిన చేరిన భగత్ 2014-18 ఎన్నికల సమయంలో ఆ స్థానంలో పోటీ చేసిన తన తండ్రి నర్సింహయ్యకు ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహకుడిగా పార్టీకి సేవలందించారు. 2018లో తన తండ్రి నోముల నర్సింహయ్య నాగార్జునసాగర్‌లో విజయం సాధించడంలో తనవంతు పాత్ర పోషించారు.
ఆ తరువాత కూడా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో సైతం భగత్ చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. 1984 అక్టోబర్ 10న జన్మించిన నోముల భగత్ భగత్ ఇంజినీరింగ్ చదివి ఆ తరువాత ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం తన తండ్రి తరహాలోనే ఎల్ఎల్బీ పూర్తి చేశారు.
హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తూనే ఎల్ఎల్ఎం పట్టా అందుకున్నారు. 2010-2012 సమయంలో సత్యం కంపెనీలో జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేశారు. విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్‌గానూ సేవలందించారు. 2014-2018 వరకు హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. న్యాయవాదిగా సేవలందించారు. నోముల భగత్‌కు భార్య భవానీ, కుమారుడు రానాజయ్, కుమార్తె రేయాశ్రీ ఉన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.