6 రాష్ట్రాలకే 56 శాతం నిధులు... కేంద్రంపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ

కోవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగిందని... కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి మండిపడ్డారు.

news18-telugu
Updated: May 23, 2020, 5:56 PM IST
6 రాష్ట్రాలకే 56 శాతం నిధులు... కేంద్రంపై మండిపడ్డ టీఆర్ఎస్ ఎంపీ
ఎంపీ రంజిత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రధాని నరేంద్రమోదీపై చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సమఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వం కావాలని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన నరేంద్ర మోదీ... ప్రధానమంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తోందని ఆరోపించారు. లాక్‌డౌన్‌ ప్రకటించే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదని... వారిని చేర్చే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదని ఆరోపించారు.

కోవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగిందని... కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ఇన్ని సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారని... కానీ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదని ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎంలోన్ పరిమితి పెంచడానికి రాష్ట్రాలకు నానా రకాల ఆంక్షలు పెడుతున్నారని... కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలను న్యాయం చేయడం లేదని కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారని అన్నారు.
First published: May 23, 2020, 4:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading