Home /News /politics /

హరీశ్‌రావు బాటలో కవిత... ఆ పదవికి రాజీనామా

హరీశ్‌రావు బాటలో కవిత... ఆ పదవికి రాజీనామా

ఎంపీ కవిత(ఫైల్ ఫోటో)

ఎంపీ కవిత(ఫైల్ ఫోటో)

నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గౌరవాధ్యక్ష పదవికి రాజీనా చేశారు. కొన్నేళ్లుగా టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత... సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను విజయపథంలో నడిపించడంలో సక్సెస్ సాధించారు.

ఇంకా చదవండి ...
    టీఆర్ఎస్ ముఖ్యనేతలు తమకున్న కొన్ని పదవులను వదులుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గౌరవాధ్యక్ష పదవికి రాజీనా చేశారు. కొన్నేళ్లుగా టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కవిత... సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ను విజయపథంలో నడిపించి సక్సెస్ సాధించారు. తెలంగాణలోనూ అనేక జిల్లాల్లో విస్తరించిన సింగరేణి బెల్ట్‌లో టీఆర్ఎస్ బలోపేతానికి ఈ సంఘం ఎంతగానో కృషి చేసింది. అయితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా ఉంటూ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించడం ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని భావించిన పార్టీ నాయకత్వం... ఈ పదవులకు రాజీనామాలు చేయాలని సూచించింది.

    ఈ మేరకు కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దీంతో కవిత టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రెండు రోజుల క్రితం మాజీమంత్రి, టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు సైతం గుర్తింపు పొందిన ఆర్టీసీ కార్మిక సంఘం టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంపై రకరకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే తాజాగా కవిత కూడా సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్ష పదవిని వదులుకోవడంతో... హరీశ్ రావు కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే టీఎంయూ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు స్పష్టమవుతోంది. మరోవైపు గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు రాజీనామా చేయాలని టీఆర్ఎస్‌లోని ఇతర నాయకులకు కూడా ఆదేశాలు వెళ్లాయని... వారంతా కూడా త్వరలోనే తమ పదవులకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది.
    First published:

    Tags: CM KCR, Harish Rao, MP Kavitha, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు