TRS MP KAVITHA COUNTERS CONGRESS CONFIDENT ON VICTORY
రాజీనామాకు సిద్ధపడ్డ రేణుక... ఉత్తమ్ భార్యకు టికెట్ ఎలా ?: ఎంపీ కవిత
ఎంపీ కవిత (ఫైల్ ఫోటో)
టీఆర్ఎస్ను ఫ్యామిలీ పార్టీ అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... తన భార్యకు టికెట్ ఎలా తీసుకుంటారని కవిత ప్రశ్నించారు. ఉత్తమ్ తన భార్య టికెట్ ఉపసంహరించుకుంటే గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించిన కవిత... కోదాడలో టీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు సడన్‌గా సెటిలర్లపై ప్రేమ పుట్టుకొచ్చిందని టీఆర్ఎస్ ముఖ్యనేత, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో కమ్మ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని కవిత తెలిపారు. అందుకే కుసుమకుమార్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కవిత... పలు అంశాలపై స్పందించారు. టీఆర్ఎస్ను ఫ్యామిలీ పార్టీ అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... తన భార్యకు టికెట్ ఎలా తీసుకుంటారని కవిత ప్రశ్నించారు. ఉత్తమ్ తన భార్య టికెట్ ఉపసంహరించుకుంటే గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించిన కవిత... కోదాడలో టీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు.
టీఆర్ఎస్కు వందకు పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరిస్తారని... తెలంగాణ టీడీపీ అభ్యర్థిని కాదని కామెంట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో మళ్లీ 9 సీట్లు గెలుస్తామని కవిత తెలిపారు. జగిత్యాల సీటును కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇస్తామని అన్నారు. రూరల్,అర్బన్ అనే తేడా లేకుండా... అంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఈ సారి అత్యధిక సీట్లు గెలుస్తామని వివరించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.