Home /News /politics /

TRS MP KAVITA COMMENTS ON PM MODI

తెలంగాణ ప్రజలతోనే టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్: ఎంపీ కవిత

mp kavitha file

mp kavitha file

ప్రధాని మోదీపై నిజామబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శలు సంధించారు. నిజామబాద్ బీజేపీ బహిరంగసభలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మోదీ చేసిన విమర్శలను ఆమె తప్పుబట్టారు. నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు.

  నిజామబాద్ బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు ఎంపీ కల్వకుంట్ల కవిత. మోదీవన్నీ అడ్డగోలు మాటలని ఎద్దేవా చేశారు. నిజామబాద్ రోడ్లు తవ్వబడి ఉన్నాయని చెబుతున్న ప్రధాని మోదీకి.. మౌలిక వసతుల కల్పన కోసం రోడ్లు తవ్వాల్సి వస్తుందని తెలియకపోవడం బాధాకరమన్నారు.

  తమది సంక్షేమ రాష్ట్రమని.. అందుకే ఒక్క నిజామబాద్ పట్టణంలోనే 28వేల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ఆ విషయాన్ని మోదీ గుర్తించడం లేదన్నారు. అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకే రోడ్లు తవ్వామని, అది గుర్తించకుండా స్థానిక బీజేపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదివారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తును ద‌ృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలు ఎంతో సహనంతో, ఓపికతో తమకు సహకరిస్తున్నారని, త్వరలోనే రూ. 150 కోట్ల నిధులతో మెరుగైన రోడ్లు నిర్మించుకుంటామని కవిత చెప్పారు.

  టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదని ప్రధాని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తామెవ్వరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోలేదని, తెలంగాణ ప్రజలతో మాత్రమే టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని కవిత స్పష్టం చేశారు.
  Published by:Santhosh Kumar Pyata
  First published:

  Tags: Bjp, MP Kavitha, Pm modi, Telangana, Telangana Election 2018, Telangana News

  తదుపరి వార్తలు