కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల వల్లే తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు పెరిగాయని...నిజామబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. ఇప్పుడు అదే పార్టీ వారిని ఓదార్చేందుకు దుబాయ్ టూర్లు చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గల్ఫ్ బాధితుల కోసం రూ.6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించిందని చెప్పారు.
గల్ఫ్ బాధితులకు అన్నివిధాలా అండగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కవిత అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే గల్ఫ్ బాధితుల సంక్షేమం గురించి మాట్లాడుతోందని విమర్శించారు. గల్ఫ్ లో చనిపోయిన 1258 మంది తెలంగాణ వారి మృతదేహాలను పైసా ఖర్చు లేకుండా స్వదేశానికి తీసుకొచ్చి, వారి కుటుంబీకులకు అప్పగించామని గుర్తు చేశారు.
శుక్రవారం కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ బృందం.. దుబాయ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడి తెలంగాణ వలస కార్మికులకు.. మేనిఫెస్టోను వివరించి.. అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలను తెలియజేసింది. అయితే, టీ కాంగ్రెస్ దుబాయ్ టూర్.. ఓట్లు, సీట్ల కోసమేనని కవిత ఎద్దేవా చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.