Home /News /politics /

TRS MP KAVITA COMMENTS ON COMENTS ON KUSHBU

తెలంగాణ గురించి ఆమెకేం తెలుసు? ఖుష్బూపై ఎంపీ కవిత సెటైర్లు

kavita and kushbu

kavita and kushbu

తెలంగాణ కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని.. పక్క రాష్ట్రం నుంచి వచ్చే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎంపీ కవిత సెటైర్ వేశారు. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనపై కాంగ్రెస్ నేత ఖుష్బూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు వస్తున్న స్టార్ క్యాంపెయినర్స్, నటులు.. తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని నిజామబాద్ ఎంపీ కవిత అన్నారు. మహిళలను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానించిందంటూ ఖుష్బూ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని.. వారిని చదివించేందుకు ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ ప్రచారసారథలు ఒకసారి చెక్ చేసుకోవాలని హితవు పలికారు.

    తెలంగాణలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్న సీనియర్ నటి, ఏఐసీసీ నేత ఖుష్బూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మహిళలంటే ఒక్క కేసీఆర్ కూతురు కవితేనా? అని ఆమె ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కవిత.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడపిల్లల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాల గురించి తెలుసుకుని మాట్లాడాలంటూ కౌంటర్ ఇచ్చారు.

    పసుపు రైతులను పట్టించుకోని బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ అభ్యర్థులను నిలదీయాలని రైతులకు సూచించారు. మహాకూటమిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
    Published by:Santhosh Kumar Pyata
    First published:

    Tags: CM KCR, MP Kavitha, Telangana, Telangana Election 2018, Telangana News, Trs, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు