Home /News /politics /

TRS MP D SRINIVAS TO REJOIN CONGRESS ON JANUARY 24TH SONIA GANDHI OKAYS REVANTH REDDY REQUEST SOME OPPOSE MKS

ఫలించిన Revanth reddy రిక్వెస్ట్ -24న కాంగ్రెస్‌లోకి డీఎస్ -నమ్మకద్రోహులకు మళ్లీ నీడా?

టీపీసీసీ రేవంత్ ఇటీవల డీఎస్ ను కలిసినప్పటి దృశ్యం

టీపీసీసీ రేవంత్ ఇటీవల డీఎస్ ను కలిసినప్పటి దృశ్యం

రేవంత్ రిక్వెస్ట్ కు హైకమాండ్ ఆమోదం తెలపడంతో డీఎస్ చేరికకు రంగం సిద్దమైంది. ఈ మేరకు సోనియా గాంధీ అపాయింట్మెంట్ సైతం ఖరారైంది. అయితే, అన్ని రకాల పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన డీఎస్ ను మళ్లీ చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి..

ఇంకా చదవండి ...
తెలంగాణ కాంగ్రెస్ లో మరో ఆసక్తికర పరిణామానికి ముహుర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తో విభేదాల కారణంగా గులాబీ పార్టీలో ఇమడలేకపోతున్న టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (D Srinivas) అలియాస్ డీఎస్ తిరిగి సొంత గూటికి చేరనున్నారు. డీఎస్ కారు దిగి చేయి పట్టుకునేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. రేవంత్ రిక్వెస్ట్ కు హైకమాండ్ ఆమోదం తెలపడంతో డీఎస్ చేరికకు రంగం సిద్దమైంది. ఈ మేరకు సోనియా గాంధీ అపాయింట్మెంట్ సైతం ఖరారైంది. అయితే, అన్ని రకాల పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన డీఎస్ ను మళ్లీ చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి..

టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్‌ సొంత గూటికి రాబోతున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది రాజకీయంగా డీఎస్‌ ఎదుగుదలంతా కాంగ్రెస్‌ పార్టీలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది.

shocking Tsunami : అమెరికా సహా పలు దేశాలల్లో సునామీ.. సముద్రం అడుగున భారీ అగ్నిపర్వతం పేలి..


రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగింది. ఈ నేపథ్యంలోనే డీఎస్ కాంగ్రెస్‌‌లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌ డీఎస్‌ ఇంటికి వెళ్లి డీఎస్‌ను పరామర్శించారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు బీజం పడిందని చెబుతున్నారు. రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు.

Gaddam Meghana: న్యూజిలాండ్ యువ ఎంపీగా 18ఏళ్ల తెలుగమ్మాయి.. గడ్డం మేఘన ఘనత


అయితే, డీఎస్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ లోనే కొందరు నేతలు తప్పుపడుతున్నారు. అవకాశవాదులకు మరోసారి ఛాన్స్ ఇవ్వవద్దని హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేశారు. డీఎస్ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదని, చేర్చుకుని అనవసర తలనొప్పులు తెచ్చుకోవద్దని కూడా కొందరు నేతలు సూచిస్తున్నారు. డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీలో ఉన్నాడని, తండ్రీకొడుకులు కలిసి ఆడుతోన్న డ్రామాలో భాగంగానే డీఎస్ కాంగ్రెస్ లోకి వస్తున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రచార కార్యదర్శి మధు యాష్కిలు మాత్రం డీఎస్ చేరికపై పాజిటివ్ గా ఉన్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, D Srinivas, Nizamabad, Revanth reddy, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు