బీజేపీలోకి వెళితే భవిష్యత్ ఆగమే...కుట్రలు వద్దన్న టీఆర్ఎస్

బీజేపీ నేతలు తమ ప్రయత్నాలను ,పనిచేసే విధానాన్ని నమ్ముకోవడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు.

news18-telugu
Updated: November 14, 2019, 6:59 PM IST
బీజేపీలోకి వెళితే భవిష్యత్ ఆగమే...కుట్రలు వద్దన్న టీఆర్ఎస్
కర్నె ప్రభాకర్, లక్ష్మణ్
  • Share this:
బీజేపీలోకి వెళ్లాలనుకునే వారు తమ రాజకీయ భవిష్యత్‌ను ఆగం చేసుకోవడం తప్పితే మరొకటి కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తమతో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. బీజేపీ నేతలు తమ ప్రయత్నాలను ,పనిచేసే విధానాన్ని నమ్ముకోవడం లేదని ఆరోపించారు. కేవలం కుట్రలు ,కుతంత్రాలతోనే రాజకీయాలు నడపడాన్నే బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీజేపీ రాజకీయ దుర్మార్గపు క్రీడ ఆడుతోందని కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. లక్ష్మణ్ ఇలాంటి ప్రకటనలు చేయడం నీతి మాలిన రాజకీయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

హుజూర్ నగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోయి నాలుగో స్థానానికి చేరుకుందని... అలాంటి పార్టీతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా టచ్‌లో ఉంటారని కర్నె ప్రభాకర్ ప్రశ్నించారు. కుట్రలు ,కుతంత్రాలకు ప్రజలు ఎపుడూ తీర్పు ఇవ్వరని అన్నారు. లక్ష్మణ్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ వెంటే ఉన్నారని కర్నె ప్రభాకర్ అన్నారు.


First published: November 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు