• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TRS MLAS JAGADISH REDDY AND BALKA SUMAN COUNTER ATTACK ON CHANDRABU NAIDU

అదే నిజమైతే ఆనాడు కేసీఆరే సీఎం అయ్యేవారు కదా..: బాబుపై టీఆర్ఎస్

అదే నిజమైతే ఆనాడు కేసీఆరే సీఎం అయ్యేవారు కదా..: బాబుపై టీఆర్ఎస్

బాల్క సుమన్, చంద్రబాబు నాయుడు(File)

అభివృద్దిలో కేసీఆర్‌తో చంద్రబాబు పోటీ పడలేకపోతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, బాల్క సుమన్‌లు విమర్శించారు. ఎవరిని కదిలించినా తెలంగాణ అభివృద్ది గురించే చెబుతారని.. చంద్రబాబు చేసిందేమి లేదని అన్నారు. ఇకనైనా చంద్రబాబు అబద్దాలు మానుకుని.. చేతనైతే కేసీఆర్‌తో అభివృద్దిలో పోటీ పడాలని సూచించారు.

  • Share this:
    వైఎస్రాయ్ ఎపిసోడ్ సిద్దాంతకర్త కేసీఆరే అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, బాల్క సుమన్‌లు కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కేసీఆరే సూత్రధారి అయి ఉంటే.. ఆయనే సీఎం అయ్యేవారు కదా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

    కేసీఆర్‌ను మోదీ మనిషిగా అభవర్ణించడాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. బీజేపీతో టీఆర్ఎస్‌కు ఎప్పుడూ సంబంధాలు లేవన్నారు. కేంద్రంతో తమది కేవలం రాజ్యాంగబద్దమైన సంబంధమేనని స్పష్టం చేశారు. చంద్రబాబు లాగా తాము పూటకో విధానం అనుసరించడం లేదన్నారు. అబద్దాలతో ఏపీ ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు.

    తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దుపెట్టుకుంటానని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పారని.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర సాధన కోసమే ఆయన ఆ పనిచేశారని తెలిపారు. చంద్రబాబు, టీడీపీ సహా 36 పార్టీలను తెలంగాణ కోసం ఒప్పించిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్‌కు మోదీ దోస్తీ ఉందని చంద్రబాబు ప్రచారం చేశారని.. అయినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌నే గెలిపించారని అన్నారు.


    అభివృద్దిలో కేసీఆర్‌తో చంద్రబాబు పోటీ పడలేకపోతున్నారని విమర్శించారు. ఎవరిని కదిలించినా తెలంగాణ అభివృద్ది గురించే చెబుతారని.. చంద్రబాబు చేసిందేమి లేదని అన్నారు. ఇకనైనా చంద్రబాబు అబద్దాలు మానుకుని.. చేతనైతే కేసీఆర్‌తో అభివృద్దిలో పోటీ పడాలని సూచించారు. కేసీఆర్‌ను బూచిగా చూపించి ఏపీలో ఓట్లు పొందాలనుకుంటే తెలివితక్కువ తనమే అవుతుందన్నారు. చంద్రబాబు ఆందోళన చూస్తుంటే.. ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందే తెలుస్తోందని ఎద్దేవా చేశారు.
    First published:

    అగ్ర కథనాలు