మెత్తబడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే... త్వరలోనే కీలక పదవి ?

టీఆర్ఎస్ తరపున మూడుసార్లు తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారని అన్నారు. షకీల్ వివరణతో ఈ వివాదం చల్లబడినట్టే అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

news18-telugu
Updated: September 13, 2019, 11:47 AM IST
మెత్తబడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే... త్వరలోనే కీలక పదవి ?
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
  • Share this:
మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ మెత్తబడ్డారు. నిన్న నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ను షకీల్‌ కలవడం రాజకీయవర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీని కలిసిన షకీల్... త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో దీనిపై షకీల్ స్పందించారు. తన నియోజకవర్గంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనాలని కోరేందుకు ఎంపీ అరవింద్‌ను కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేసీఆర్ తనకు రాజకీయ గురువు అని వ్యాఖ్యానించారు.

Trs mla shakeel ahmed, bodhan mla, ktr, cm kcr, nizambad mp, dharmapuri aravind, bjp, trs, telangana news, టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బోధన్ ఎమ్మెల్యే, కేటీఆర్, కేసీఆర్, ఎంపీ ధర్మపురి అరవింద్
ఎంపీ అరవింద్‌ను కలిసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్


టీఆర్ఎస్ తరపున మూడుసార్లు తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారని అన్నారు. షకీల్ వివరణతో ఈ వివాదం చల్లబడినట్టే అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు షకీల్‌ను బుజ్జగించే క్రమంలో అతడికి కీలకమైన నామినేటేడ్ పదవి ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించినట్టు సమాచారం. మంత్రి పదవులు దక్కకుండా అసంతృప్తికి గురైన పలువురు నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్... షకీల్‌కు కూడా నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు