తహశీల్దార్ హత్య... వివరణ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మృతి చెందిన ఎమ్మార్వో విజయారెడ్డి

తాను తహశీల్దార్‌ను బెదిరించానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. విజయారెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

  • Share this:
    తహశీల్దార్ విజయారెడ్డి హత్య అత్యంత బాధాకరమని ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తాను తహశీల్దార్‌ను బెదిరించానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన తెలిపారు. విజయారెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి మూడుసార్లు ఓడిపోయిన ఫ్రస్టేషన్‌లో ఉన్నారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. విజయారెడ్డి హత్య కేసులో నిందితుడైన సురేష్ తమ పార్టీ పార్టీ కార్యకర్త కాదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందే అతడు కాంగ్రెస్‌లోకి వెళ్లాడని అన్నారు.

    ఆరు నెలల కిందట భూ వివాదంలో గౌరెల్లి గ్రామస్థులు నా దగ్గరకు వచ్చారని... 60 మంది రైతులతో కలిసి నేను జాయింట్ కలెక్టర్‌ను కలిశానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వివరించారు.విజయారెడ్డి మాట్లాడుతున్నట్టున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం... తనపై కొందరు ఆరోపణలు చేయడంతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి దీనిపై వివరించారు.
    First published: