కార్యకర్తపై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. నిలదీసిన గ్రామస్తులు

అంథోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహనం కోల్పోయి ప్రవర్తించారు. సొంత పార్టీ కార్యకర్తపైనే ఆయన చేయిచేసుకున్నాడు.

news18-telugu
Updated: September 21, 2020, 2:01 PM IST
కార్యకర్తపై చేయిచేసుకున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. నిలదీసిన గ్రామస్తులు
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(ఫొటో క్రెడిట్-FACEBOOK/Chanti Kranti Kiran)
  • Share this:
అంథోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సహనం కోల్పోయి ప్రవర్తించారు. సొంత పార్టీ కార్యకర్తపైనే ఆయన చేయిచేసుకున్నాడు. దీంతో బాధిత వ్యక్తితో మరికొంత మంది కలిసి ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోగుట మండలం వెంకట్రావుపురంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వెంకట్రావుపేటలో కార్యకర్తలను కలిసేందకు వెళ్లారు. ఆయనతో పాటు టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి‌ కూడా ఉన్నారు.

ఈ క్రమంలోనే గ్రామంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కనకరాజు అనే కార్యకర్త.. పార్టీలో ‌తనకు సభ్యత్వం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. కార్యకర్తకు సమాధానం ఇవ్వాల్సిన ఎమ్మెల్యే.. సహనం కోల్పోయాడు. అసహనంతో కనకరాజుపై చేయి చేసుకున్నాడు. దీంతో గ్రామస్తులంతా ఒక్కటై ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. తమ ఊరికి వచ్చి తమ పిల్లపై చేయిచేసుకుంటావా అని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే వారికి క్షమాపణ చెప్పి.. అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. ఇక, ఇందుకు సంబంధించిన ద‌ృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 21, 2020, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading