జోకర్ బ్రోకర్... పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్

పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

news18-telugu
Updated: September 17, 2019, 4:06 PM IST
జోకర్ బ్రోకర్... పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్ట సభలకు విరుద్ధంగా మాట్లాడవద్దని ఈ జోకర్, బ్రోకర్‌లకు తెలియదా అంటూ పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ తీర్మానం నాలుక మీద గోక్కోవడానికి కూడా పనికిరాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని గువ్వల బాలరాజు అన్నారు. దీనిపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంద్రప్రదేశ్‌లో చెల్లని పవన్ కళ్యాణ్‌కు అడవి ఎక్కడ ఉందో తెలియదు కాని ఇక్కడ గొప్పలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఏసీ హోటల్‌లో దీనిపై చర్చలు పెడితే ఏం వస్తుందని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అనవసర ప్రసంగాలు చేయొద్దని సూచించారు. ఓటుకు నోటు దొంగ ,ఆర్టీఐ రెడ్డి, రైఫైల్ రెడ్డిగా పేరును తుడిచేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే బాలరాజు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పుట్టిన ఊరు వాళ్లు తనకు ఓటు వేసి గెలిపించారని వ్యాఖ్యానించారు.


First published: September 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>