షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నిందితులను చంపేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిపని చేస్తే... అదే పార్టీకి చెందిన మీరు తప్పేుబట్టుతారా? అంటూ విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్లు.

news18-telugu
Updated: December 10, 2019, 4:14 PM IST
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ఘటనా స్థలం
  • Share this:
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశం ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశాకు సత్వర న్యాయం జరిగిందని సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐతే పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, నిందితుల బంధువులు మాత్రం ఎన్‌కౌంటర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని.. పోలీసులు ఇలా చంపుకుంటూ పోతే ఇక చట్టాలు,కోర్టులు ఎందుకని మండిపడుతున్నారు. ఈ జాబితాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా చేరారు. సీఎం కేసీఆర్‌ను అందరూ మెచ్చుకుంటుంటే.. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మాత్రం ఎన్‌కౌంటర్‌ను తప్పుబట్టారు.

దిశా నిందితుల ఎన్‌కౌంటర్ బాధాకరమని నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఉంటారని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు గొంగిడి సునీత. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గొంగిడి సునీత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. నిందితులను చంపేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిపని చేస్తే... అదే పార్టీకి చెందిన మీరు తప్పుబట్టుతారా? అంటూ విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్లు.

mla gongidi cries in assembly, trs mla gongidi sunitha, assembly whip, trs, aler mla, kidney dialysis patients, Telangana news, అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీల్, టీఆర్ఎస్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత(ఫైల్ ఫోటో)


First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>