Home /News /politics /

TRS MLA CHALLA DHARMA REDDY COUNTER ATTACK ON KONDA FAMILY OVER DEMOLITION OF THE MONUMENT ISSUES IN WARANGAL PRV

Challa Dharma reddy: నాకు కోపం వస్తే అడ్రస్​ లేకుండా పోతారు.. కొండా దంపతులపై టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్​

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి( ఫైల్ ఫోటో)

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి( ఫైల్ ఫోటో)

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రహంపాడ్ లో కొండా మురళీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన స్థూపాన్ని టీఆర్ఎస్ (TRS) శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి.

ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో పొలిటికల్​ హీట్​ పెరిగింది.  ఆత్మకూరు మండలం అగ్రహంపాడ్ లో కొండా మురళి తల్లిదండ్రుల సమాధులను టీఆర్ఎస్ (TRS) శ్రేణులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. దీంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ కక్షలు ఎగిసిపడ్డాయి.  హుటాహుటిన సమాదుల దగ్గరకు వచ్చిన కొండా సురేఖ (Konda Surekha) అత్తమామలకు నివాళి అర్పించారు. పడుకున్న సింహాన్ని లేపారని కొండా మురళి (Konda Murali) కూతురు సుశ్మితా పటేల్ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆదేశంతో స్థూపాన్ని కూల్చేశారని కొండా సురేఖ ఆరోపించారు. ఇకపై కొండా ఫ్యామిలీ అంటే ఏంటో చూపిస్తామని చల్లా ధర్మారెడ్డి (MLA Challa Dharma Reddy)ని హెచ్చరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే  అభివృద్ధి..

ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి (MLA Challa Dharma Reddy స్పందించారు. తనకు కోపం వస్తే కొండా దంపతులు అడ్రస్​ లేకుండా పోతారన్నారు. ప్రజలు కొండా దంపతులను ఎప్పుడో తరిమికొట్టారని చల్లా విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే అగ్రహంపాడ్ అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల ఆగ్రహనికీ గురై కొండా దంపతులు అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫైర్ అయ్యారు.

ఏం జరిగింది..?

మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) తల్లిదండ్రుల సమాధులను ధ్వంసం (demolition of the monument) చేయడానికి యత్నించడమే ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ సమాధుల ధ్వంసానికి పాల్పడుతుండగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటన (demolition of the monument)పై మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) ఫైర్​ అయ్యారు. తన అత్తా మామ సమాధులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి (Challa Dharmareddy) ఆదేశాలతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యేను కొండా సురేఖ తీవ్రంగా హెచ్చరించారు.

కొండా సురేఖ ఏమన్నారంటే..?

మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ (Congress Former MLA Konda Surekha) ఘటనపై మాట్లాడుతూ.. ''ధర్మారెడ్డి..  పులిని తట్టి లేపావు. ఇక కాస్కో. ఏం చేస్తావో చేసుకో. కానీ నీ పాపం పండింది. ప్రజలు తిరగబడి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే వున్నాయి. గతంలో మూడు కోట్ల కాంట్రాక్ట్ కోసం మా వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్న సంగతి మరిచావా? గుర్తుపెట్టుకో... కొండాను ఢీ కొట్టడమంటే కొండను ఢీకొట్టినట్లే. మేం ఇక్కడ లేకుంటేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావని గుర్తుంచుకో'' అంటూ కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇవి కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Konda surekha, Trs, TS Congress, Warangal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు