రేవంత్ రెడ్డి చెబుతున్న ఫామ్ హౌస్‌ను కేటీఆర్ నాలుగేళ్ల కిందటే లీజుకు తీసుకున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వివరణ ఇచ్చారు. రేవంత్ చెబుతున్న భూములు 2014 ఆఫిడవిట్లోనే కేటీఆర్ చూపించారని... ఎక్కడా దాచిపెట్టలేదని తెలిపారు. కేటీఆర్‌తోపాటు తాము కూడా అక్కడికి వెళ్లామని బాల్క సుమన్ అన్నారు. అక్కడ 8 ఎకరాల 9 గుంటల భూమి కేటీఆర్ భార్య పేరు మీద ఉందని వివరించారు. రేవంత్ రెడ్డి బట్టకాల్చి మీద వేస్తున్నాడని మండిపడ్డారు. గోపనపల్లిలో దళితుల భూములను రేవంత్ బ్రదర్స్ కబ్జా చేశారని ధ్వజమెత్తారు.
బాల్క సుమన్ (ఫైల్ ఫోటో)
పేదలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి రేవంత్ రెడ్డి కబ్జాకోరుగా మారిపోయారని అన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్‌పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తనను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డిని మరువలేక రేవంత్ రెడ్డి పట్నం గోస అనే కార్యక్రమం పెట్టుకున్నాడని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.