కాలువలో దూకిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ... హరీశ్ రావు ఆనందం

చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో సంబురంతో మునిగి తేలారు. మంత్రి హరీశ్ రావు ఏంపీ, ఎమ్మెల్యేలపై నీళ్లు చల్లుతూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.

ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.

  • Share this:
    చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో సంబురంతో మునిగి తేలారు. మంత్రి హరీశ్ రావు ఏంపీ, ఎమ్మెల్యేలపై నీళ్లు చల్లుతూ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
    ఈ కార్యక్రమంలో ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.స్థానిక నేతలు కాలువలో ఈత కొడుతూ ఆనందంలో మునిగారు.. ఈ మేరకు మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండల ప్రజాప్రతినిధులు కాలువల్లో దూకి ఈత కొట్టారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కాలువలో ఈత కొడుతున్న ఆనందించారు.. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ సెల్ఫీలు దిగి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.
    Published by:Venu Gopal
    First published: