నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విద్యార్హతలపై ఆరోపణలు

ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ఎంపీ అరవింద్ తన విద్యార్హతల సర్టిఫికెట్ల విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆరోపించారు

  • Share this:
    నిజామాబాద్ ఎంపీ అరవింద్ తన చదువు విషయంలో ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆరోపించారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించడంలో అరవింద్ దిట్ట అని ఆరోపించారు. అరవింద్ మాటలు చూస్తే తుపాకిరాముడి మాటల్లా ఉంటాయని ఎద్దేవా చేశారు. ‘అరవింద్‌ను చూస్తుంటే తుపాకిరాముడు గుర్తొస్తున్నాడు. ఆయన ఎంత అదృష్టవంతుడంటే, నిజామాబాద్ రైతులను మోసం చేసి, పసుపు బోర్డు తెచ్చిస్తానని హామీ ఇచ్చారు. మోస పూరిత హామీలతో గెలిచారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించడంలో అరవింద్ దిట్ట. మోసపూర్తి హామీలతో ఎంపీ అరవింద్ గెలిచారు. పొలిటికల్ సైన్స్ చదవి ఉంటే నేను చాలా పెద్దవాడిని అయిపోయేవాడిని అని మాట్లాడారు.’ అని బాజిరెడ్డి విమర్శించారు. అరవింద్‌కు ఏమీ రాదని, ఎవరో అడ్వైజర్ రాసిచ్చిన డైలాగ్‌లను పలుకుతున్నారని చెప్పారు. ఆ మాటలు ప్రజల్లో చర్చనీయాంశం అయితే తానేదో పెద్ద వాడిని అయిపోయినట్టు ఫీల్ అవుతారని బాజిరెడ్డి ఆరోపించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: