Home /News /politics /

TRS MINISTER SRINIVAS GOUD SENSATIONAL REPLY OVER ELECTION AFFIDAVIT TAMPERING ALLEGATIONS FULL DETAILS HERE MKS

Srinivas Goud: చిన్న కులంలో పుట్టడం నేరమా? ఎన్నికల ట్యాంపరింగ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ రిప్లై

ట్యాంపరింగ్ వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ

ట్యాంపరింగ్ వివాదంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ

స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్‌ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. చిన్న కులంలో పుట్టినందుకే తనపై కుట్రలు చేస్తున్నారంటూ సంచలన రిప్లై ఇచ్చారాయన..

‘ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ ఉదంతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు’ అంటూ కొద్ది గంటలుగా మీడియాలో సంచలనల కథనాలు ప్రసారం అవుతున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌ గౌడ్‌ అక్రమాలకు పాల్పడినట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిందని, నిబంధనలకు విరుద్ధంగా రెండు అఫిడవిట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు తేలిందని, స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్‌ చేసినట్లుగా నిర్ధారణ అయిందని, సాంకేతిక బృందం పరిశీలన తర్వాత మంత్రిపై ఈసీ కఠిన చర్యలు ఉండొచ్చంటూ వార్తలు వచ్చాయి. తొలుత ‘సాక్షి’మీడియాలో ఈ కథనాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ఈ అంశంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా స్పందించారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ట్యాంపరింగ్ ఉదంతంలో నిజానిజాలు ఏమిటో, తనపై ఎందుకిలా ప్రచారం జరుగుతున్నదో వివరించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఆయన మాటల్లోనే...

‘‘బాధ్యత గల మీడియా సంస్థలు నా మీద ద్వేషం తో దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల అఫిడవిట్ ను టాంపరింగ్ చేసినట్టు నా పై ఆరోపణలు చేస్తున్నారు. వార్తలు రాసే ముందు వాస్తవాలు తెలుసుకోరా? ఇది తెలంగాణ పై కోపమా, ఉద్యమ నాయకత్వం పై కోపమా? మహబూబ్ నగర్ లో రాజకీయం గా ఎదుగుతున్నందుకు కక్ష కట్టి కొందరు ఇదంతా చేస్తున్నారు. .బీ ఫామ్ తో దాఖలు చేసే అఫిడవిటే అంతిమం అనేది ఆరోపణలు చేస్తున్న వారికి తెలియదా? ఆఖరికి ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయని బ్యాంకులకు రుణాలు ఉన్నా తెలపలేదని కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు.

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు బిగుస్తున్న ఉచ్చు! -విషయమేంటో తెలిస్తే షాకవుతారు..కేంద్ర ఎన్నికల సంఘం తో పాటు ఢిల్లీ హై కోర్టు లో కొందరు నాపై కేసులు వేశారు. ఢిల్లీ హైకోర్టు లో 15 డిసెంబర్ నాడు నా పై పిటిషన్ ను కొట్టేసింది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ హై కోర్టు పిటీషన్ దారులను తప్పుడు కేసులు వేయొద్దంటూ హెచ్చరించింది. డిస్మిస్ అయిన కేసును పట్టుకుని కొన్ని మీడియా సంస్థలు ఇలా ప్రచారం చేస్తున్నాయి. ఇది సమంజసమా? ఇందులో ఓ మాజీ మంత్రి మాజీ ఎంపీ హస్తం ఉంది. తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. మహబూబ్ నగర్ లో రికార్డు మెజారిటీ తో గెలిచాను. నాకు ఏ కులం లేదు. అందరూ సమానమే. 2014 లో సరిగా నాపేరు తండ్రి పేరు ఉన్న వ్యక్తి తో నామినేషన్ వేయించారు. నేనే ఓటర్ లిస్టు నుంచి పేరు తీసేయండని దరఖాస్తు చేసుకున్నానని కూడా బద్నాం చేశారు. నన్ను నేరుగా ఎదుర్కోలేకనే కొందరు రండ రాజకీయాలు చేస్తున్నారు.

Viral Video: రఫ్ఫాడించిన రాఫెల్.. అదరగొట్టిన ఫార్మేషన్లు.. Republic Day 2022 పరేడ్ హైలైట్స్నన్ను అప్రతిష్ట పాలు చేసిన కొన్ని మీడియా సంస్ధల పై ఇప్పటికే కోర్టులో కేసులు వేశాను. పరువు నష్టం దావా కూడా వేశాను. ఇలాంటి పిచ్చి రాతలకు భయపడను. మరింత కసితో పని చేస్తాను. జిల్లా అభివృద్ధిని ఓర్చుకోలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న కులం లో పుట్టడం నేను చేసిన నేరమా? నేను ఇల్లు కట్టుకోవద్దా? కారు కొనుకోవద్దా? ఇదేం దౌర్భాగ్యం ఈ దేశంలో? తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని వచ్చిన వాడిని. ఢిల్లీ కోర్టు డిస్మిస్ చేసిన పిటిషన్ పై ఎలా రాద్ధాంతం చేస్తారు? నేను జీవితాంతం తప్పుడు వార్తల పై వివరణ ఇవ్వాలా? నేను పనులు చేసుకోవద్దా? మూడేళ్ళుగా ఇదే కుట్ర నడుస్తోంది. మున్ముందు కూడా నడుస్తుంది. అయినా ఎదుర్కుంటా. నా పై తప్పుడు ఆరోపణలతో వార్తలు రాసిన వారే అవి నిజం కావని రాయాలి. రాసేపుడు సిగ్గు అనిపించలేదా? ఇలాంటివి మంచివి కాదు. అట్టడుగు వర్గాల పై ద్వేషం మంచిది కాదు.

Padma Awards 2022: కిన్నెర మొగిలయ్యకు పద్మ శ్రీ పురస్కారం.. భీమ్లా నాయక్‌తో ఫేమ్.. తెలంగాణ, ఏపీ నుంచి పద్మాలు వీరే..ఎలా చూసినా ప్రజా సేవలో నేనే ముందున్నాను. నా నియోజకవర్గం వచ్చి విచారించుకోవచ్చు. కానీ ప్రజలను గందర గోళం లోకి నెడుతున్నారనే ఆవేదనతోనే ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డా. దయచేసి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం మంచిది కాదు. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కానివ్వద్దు. పైచాచిక ఆనందం పొందాలనే ప్రయత్నం ఎవరికి మంచిది కాదు. నా పై కుట్రలు పెరిగినా నా మెజారిటీ పెరుగుతూనే ఉంది. వచ్చే సారి గతం లో కన్నా ఎక్కువ మెజారిటీ తో గెలుస్తా. ఎన్నికల సంఘం అఫిడవిట్లు మార్చే వీలు ఉండదని చిన్న పిల్లాన్ని అడిగినా చెబుతారు. ఇలా మార్చేదుంటే అందరూ మార్చే వారే. ఎన్నికల సంఘం ఎవరి పైనైనా పిటిషన్ స్వీకరిస్తారు. అవును కాదు అని అపుడే వాళ్ళు చెప్పలేరు.

Republic Day 2022: తెలుగు బిడ్డ జశ్వంత్‌కు శౌర్యచక్ర.. మరో 11 మంది జవాన్లకూ.. గాలంట్రీ, పోలీస్ మెడల్స్ ఎందరికంటే..పిటిషన్ విచారణకు స్వీకరించిన మాత్రాన నేను తప్పు చేసినట్టు కాదు. మా పార్టీ వాళ్ళెవ్వరూ ఈ కుట్రలో లేరు. మా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎంపీ ,ఇంకో నాయకుడి పేర్లు వారు నా పై చేసిన కుట్ర ను త్వరలో బయట పెడతా. లీగల్ గా ఇప్పటికే ఎదుర్కొంటున్నా. ఇకపై కూడా ఎదుర్కొంటాను..’అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదంతో తనకు సంబంధం లేదని, గతంలో ఈ అంశంపై కోర్టు కేసు కొట్టుడు పోయిందని, తాజా పిటిషన్ పరిశీలన దశలోనే ఉందని మంత్రి వ్యాఖ్యలతో తేటతెల్లం అయింది.
Published by:Madhu Kota
First published:

Tags: Election Commission of India, Srinivas goud, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు