హోమ్ /వార్తలు /National రాజకీయం /

బీజేపీకి అధికారం అప్పగించేస్తాం.. ఆ సినిమా చూసిన ఆవేశంలో మంత్రి సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి అధికారం అప్పగించేస్తాం.. ఆ సినిమా చూసిన ఆవేశంలో మంత్రి సంచలన వ్యాఖ్యలు

 మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైల్ ఫోటో

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైల్ ఫోటో

మంచి సినిమాలు ప్రేక్షకుల్ని కదిలించడం, థియేటర్లో పూనకాలు రావడం చాలా సార్లు జరిగేదే. దీనికి రాజకీయ నేతలు సైతం అతీతం కాదనేలా.. సినిమా పూర్తయిన తర్వాత అందులో చూపించిన సీన్లను గుర్తుచేసుకుంటూ ఆ భావోద్వేగంలోనే సంచలన సవాలు చేశారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంతి శ్రీనివాస్ గౌడ్.

ఇంకా చదవండి ...

మంచి సినిమాలు ప్రేక్షకుల్ని కదిలించడం, థియేటర్లో పూనకాలు రావడం చాలా సార్లు జరిగేదే. దీనికి రాజకీయ నేతలు సైతం అతీతం కాదనేలా.. సినిమా పూర్తయిన తర్వాత అందులో చూపించిన సీన్లను గుర్తుచేసుకుంటూ ఆ భావోద్వేగంలోనే సంచలన సవాలు చేశారు తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంతి శ్రీనివాస్ గౌడ్. ప్రస్తుతం సొంత జిల్లా మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం నాడు సిటీలోని శ్రీనివాస థియేటర్ లో రైతన్న సినిమా చూశారు. అది కూడా తనకు తెలిసిన రైతులను వెంటబెట్టుకెళ్లిమరీ మంత్రి సినిమా చూశారు. విప్లవ నాయకుడు ఆర్.నారాయణమూర్తి నటించి, దర్శకత్వం వహించిన రైతన్న సినిమా చూసి మంత్రి చలించిపోయారు. షో అనంతరం థియేటర్ వద్దే మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..

రైతన్న సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని ఆర్.నారాయణమూర్తి అద్భుతంగా ఆవిష్కరించారని, ఈ సినిమాని రైతన్నలతో కలిసి థియేటర్ లో సినిమా చూడటం గొప్ప అనుభూతి అన్నారు. అన్నదాత కష్టాలను కళ్లకుకట్టినట్లు చూపించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని, రైతులు, ప్రజలు, మీడియాతో పాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ప్రజల హితాన్ని కోరే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని, రైతన్న అలాంటి సినిమానే అని మంత్రి కితాబిచ్చారు. అదే ఊపులో..

Karimnagar mlc : ఇదేందయ్యా ! అభ్యర్థి బరిలో లేకున్నా కాంగ్రెస్ క్యాంప్ రాజకీయం -ఎవరికి ఓటేయబోతున్నారు?



వ్యవసాయం, రైతులు అంశాలపై తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రంతో కొట్లాడుతోన్న దరిమిలా రైతన్న సినిమాలోని అంశాలను పోల్చుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. వ్యవసాయ రంగంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్లకు మేలు చేసేలా బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇది చాలదన్నట్లు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలంటోందని, ధాన్యం ఏమేరకు సేకరిస్తారో చెప్పకుండా రాజకీయాలు చేస్తోందని, అలాంటి పార్టీని రైతులు ఈసడించుకుంటున్నారని మంత్రి అన్నారు.

Suryapet : కూతురు అలా మంచంపై ఉండగా తల్లిని కామ కోరిక తీర్చమన్నాడు.. ఆ రాత్రి జరిగింది చూసి తట్టుకోలేక..



తెలంగాణ రావడం వల్లే ఇక్కడ బీజేపీ పార్టీకి కనీసం గుర్తింపయినా దక్కిందని, అలాంటిదిప్పుడు తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు తప్ప బీజేపీకి మరోటి చేతకాదన్నారు. అదే టీఆర్ఎస్ మాత్రం ప్రపంచమే గర్వించేలా రైతుల సంక్షేమానికి అద్బుతమైన పథకాలను అమలు చేస్తున్నదని, కేసీఆర్ నిర్ణయాల వల్ల లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. ఈ సందర్బంగా బీజేపీకి సంచలన సవాలు విసిరారు శ్రీనివాస్ గౌడ్. ‘బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలో జరుగుతున్నంత అభివృద్ది, అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు చూపిస్తే.. తక్షణమే టీఆర్ఎస్ గద్దెదిగిపోయి బీజేపీకి అధికారం అప్పగిస్తాం. దమ్ముంటే బీజేపీ నేతలు నా సవాలు స్వీకరించాలి..’అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

First published:

Tags: Bjp, Farmers, Srinivas goud, Telangana, Trs

ఉత్తమ కథలు