హోమ్ /వార్తలు /National రాజకీయం /

Huzurabad : TRS ఓటమికి అసలు కారణం ఇదే - రెండోసారీ ఫెయిలైన ట్రబుల్ షూటర్ Harish rao

Huzurabad : TRS ఓటమికి అసలు కారణం ఇదే - రెండోసారీ ఫెయిలైన ట్రబుల్ షూటర్ Harish rao

హుజూరాబాద్ ఫలితంపై మంత్రి హరీశ్ రావు

హుజూరాబాద్ ఫలితంపై మంత్రి హరీశ్ రావు

టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన మంత్రి హరీశ్ రావు వరుసగా రెండోసారి విఫలమయ్యారు.. అన్నీ తానై వ్యవహరించిన దుబ్బాక లాగే హుజూరాబాద్ లోనూ బీజేపీ విజయం సాధించింది. అయితే, టీఆర్ఎస్ ఓడిపోవడానికి మంత్రి హరీశ్ చెబుతోన్న కారణాలు మాత్రం వేరుగా ఉన్నాయి..

ఇంకా చదవండి ...

ఆయన గీసిన ప్లాన్ పక్కాగా అమలై ఉంటే ఈపాటికి ఈటలకే పోటు దిగేది.. గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగితేలేవి.. కానీ ఓటరు దేవుళ్ల శానసం మరోలా ఉండేసరికి ఆయనా ఓటమికి కారణాలను వెతుక్కోవాల్సి వస్తోంది.. టీఆర్ఎస్ పార్టీలో టాప్-3లో ఒకరిగా, ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన మంత్రి హరీశ్ రావు వరుసగా రెండోసారి విఫలమయ్యారు.. హరీశ్ అన్నీ తానై వ్యవహరించిన దుబ్బాకలో టీఆర్ఎస్ పరాజయం చెందగా.. ఇప్పుడు హుజూరాబాద్ లోనూ అదే సీన్ రిపీటైంది.. అయితే, టీఆర్ఎస్ ఓడిపోవడానికి మంత్రి హరీశ్ చెబుతోన్న కారణాలు మాత్రం వేరుగా ఉన్నాయి..

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక సందడి మొదలైన క్షణం నుంచి ఓటింగ్ ముగిసేదాకా టీఆర్ఎస్ పార్టీ కర్త, కర్మ, క్రియ అన్నీ తానుగా వ్యవహరించారు మంత్రి హరీశ్ రావు. దుబ్బాక ఫలితం హుజూరాబాద్ లో రీపట్ కారాదంటూ ఆయన శ్రేణుల్ని హెచ్చరించినా చివరికి అదే ఫలితం మూటగట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం వెలువడిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 23, 855 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దాదాపు అన్ని రౌండ్లలో ఈటల ఆధిక్యం కనబర్చారు. హుజూరాబాద్ ఫలితాలపై మంత్రి హరీశ్ రావు కీలక కామెంట్లు చేశారు..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లు వేసిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క ఎన్నికతో టీఆర్ఎస్ కుంగిపోదని, గెలిచిననాడు పొంగిపోలేదన్నారు. ఓడినా.. గెలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అంతేకాదు..

హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం కుమ్మక్కు రాజకీయాలేనని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదన్న ఆయన.. ప్రత్యర్థి పార్టీలు కలిసి పనిచేయడం వల్లే ప్రతికూల ఫలితాలొచ్చాయని చెప్పారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పని చేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లే చెబుతున్నారు. జాతీయస్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌.. రాష్ట్రస్థాయిలో కుమ్మక్కు కావడాన్ని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు’అని హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటలకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంలో తప్పులేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలను ఉదహరిస్తూ హరీశ్ తన వివరణ ఇచ్చారు.

Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Harish Rao, Huzurabad, Huzurabad By-election 2021, Trs

ఉత్తమ కథలు