Telangana: ఆ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి తలనొప్పిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం..

Telangana: ఆ జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి తలనొప్పిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

  • Share this:
    తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌కు సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా సాగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన సభ్యత్వ నమోదుపై కార్యకర్తలు అసంతృప్తిగా అన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని అంటున్నారు. టీఆర్‌ఎస్‌లో పదవులు అనుభవిస్తున్న కొందరు పార్టీ సభ్యత్వ నమోదు బుక్‌లను తీసుకోవడానికి నిరాకరించినట్టుగా సమాచారం. ఓ గ్రామంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కాకపోవడంతో ఆ గ్రామంలో మండల అధ్యక్ష స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు బలవంతంగా సభ్యత్వ నమోదు చేపట్టారు.

    మెదక్ జిల్లా నుంచి మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. కొందరు కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచిన కార్యకర్తలకు ఎలాంటి పనులు గాని రాలేదని కొందరు ఆరోపిస్తున్నారు.  కార్యకర్తలకు చిల్లిగవ్వ లేకుండా చేసిన పార్టీ అంటే అది టీఆర్‌ఎస్ పార్టీనే అని ఆ పార్టీ నేతలే అంటున్నారు.

    తెలంగాణ ఉద్యమంలో జెండాలు మోసిన వారికి పదవులు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీల నుండి వచ్చినవారికి పదవులిచ్చి జెండాలు మోసిన వారికి నడిరోడ్డుపై వదిలి వేశారని కొంతమంది కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన ఆ సంస్థలు చిల్లర డబ్బులు లేకుండా ఉన్నాయని నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న కొందరు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా ఇంచార్జ్కు సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు