అదే జరిగితే టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీ నుంచి సవాల్ ఎదురైనట్టే ?

నల్లగొండ, భువనగిరి లోక్ సభ స్థానాల పరిధిలోని హుజూర్ నగర్, మునుగోడులో ఉపఎన్నికలు జరిగితే... టీఆర్ఎస్ వాటిని గెలుచుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: June 20, 2019, 3:32 PM IST
అదే జరిగితే టీఆర్ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీ నుంచి సవాల్ ఎదురైనట్టే ?
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్( ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన టీఆర్ఎస్ తనదైన శైలిలో వాటిని సొంతం చేసుకోవడం చాలాసార్లు చూశాం. అందుకే తెలంగాణలో ఉపఎన్నికలు అంటే ఆ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడినట్టే అనే భావన ప్రజల్లోనూ ఉంది. అయితే త్వరలోనే తెలంగాణలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై అప్పుడే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ విజయం సాధించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి... తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ఉపఎన్నిక ఖాయమైంది. ఇక్కడ తమ పార్టీ జెండా ఎలా ఎగురవేయాలనే దానిపై టీఆర్ఎస్ అప్పుడే వ్యూహరచన కూడా మొదలుపెట్టింది.

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం దాదాపుగా ఖాయమనే ప్రచారం నేపథ్యంలో... ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మునుగోడు అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నికలు వస్తాయేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తరపున మళ్లీ బరిలోకి దిగాలని భావిస్తే మాత్రం... మునుగోడులో మళ్లీ ఉప ఎన్నికలు తప్పకపోవచ్చు. అదే జరిగితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయమనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన నల్లగొండ, భువనగిరి లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ గెలవలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే... టీఆర్ఎస్ వాటిని గెలుచుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయా లేదా అన్న అంశం... ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆయన రాజీనామా చేసి బరిలోకి బీజేపీ తరపున దిగితే... అక్కడ పోటీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా సాగడం ఖాయం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి కంచుకోట అయిన హుజూర్ నగర్‌ ఉపఎన్నిక కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌ మధ్యే ప్రధానంగా జరగొచ్చు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే... వాటిని గెలుచుకోవడం టీఆర్ఎస్‌కు ఒకరకంగా సవాలే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...