హోమ్ /వార్తలు /National రాజకీయం /

TRS Minority Policy: ముస్లింల పట్ల మారుతున్న టీఆర్ఎస్ విధానాలు.. సీఎం కేసీఆర్ మదిలో ఏముంది?

TRS Minority Policy: ముస్లింల పట్ల మారుతున్న టీఆర్ఎస్ విధానాలు.. సీఎం కేసీఆర్ మదిలో ఏముంది?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

TRS Minority Policy: ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తే.. ఇదే అదునుగా తీసుకొని బీజేపీ ప్రచారం చేస్తుందని, దీనిద్వారా హిందూ ఓట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది.

(Mirza Ghani Baig, Hyderabad)

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీ.. ముస్లింల ఓట్లపై నానాటికి నమ్మకాలు కోల్పోతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో గులాబీ పార్టీకి ముస్లింల నుంచి నిరాశే ఎదురైంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు చాలా చోట్ల వెయ్యికి మించి ఓట్లు రాలేదు. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు అనుకున్న స్థాయిలో ముస్లిం ఓట్లు లభించలేదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ముస్లింల పట్ల పార్టీ విధానాలను మార్చుకోవాలని తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ భావిస్తోంది. మైనార్టీ కమిషన్లు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లు, ఉర్దూ అకాడమీల్లో అన్ని నామినేటెడ్ పోస్టులను ఏడు సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే గులాబీ సర్కార్ భర్తీ చేసింది. ఈ కార్పొరేషన్లు అన్నింటిలోనూ 2020 నుంచి చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇప్పట్లో వీటికి కొత్త చైర్మన్లను నియమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదు.

Cabinet Meeting: మద్యం దుకాణాల్లో వాళ్లకు రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

అసెంబ్లీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము అంచనా వేసిన విధంగా ముస్లిం ఓట్లు తమ పార్టీకి రాలేదని టీఆర్ఎస్ నేతలే చెబుతున్నారు. 2014 నుంచి 2019 మధ్య తొలిసారి అధికారం చేపట్టాక టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల కోసం చాలా పథకాలు అమలు చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు అన్నారు. పథకాలను అమలు చేసినా ముస్లిం వర్గంలో టీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో నమ్మకాన్ని దక్కించుకోలేకపోయింది. కాగా, అమలు చేస్తున్న పతకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ముస్లింలను పార్టీకి చేరువ చేయడంలో పార్టీలోని మైనార్టీ నేతలు విఫలమయ్యారని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.

బీజేపీ దూకుడుతో..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అనూహ్యంగా పుంజుకొని ఏకంగా రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్ ఆధిపత్యానికి గండి కొట్టింది. అలాగే 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. మరోవైపు ఎంఐఎంతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. ఓట్లను తమ వైపునకు మలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారు.

రేవంత్ రెడ్డి ఆడియోను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. శశిథరూర్‌పై కామెంట్స్..

ఈ నేపథ్యంలో ఓట్లు బీజేపీ వైపు మళ్లకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధమైందని, ముస్లింల కోసం రెండు విధానాల వ్యూహాలను అమలు చేయాలని అనుకుంటోందని పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత చెబుతున్నారు. పార్టీలో క్షేత్రస్థాయి నుంచి మైనార్టీ నాయకత్వంలో ప్రక్షాళన చేయాలని అధిష్ఠానం భావిస్తోందని టీఆర్ఎస్ మైనార్టీ నేత ఒకరు ఫోన్ ద్వారా న్యూస్ 18కు చెప్పారు. అలాగే మైనార్టీ నాయకత్వంలో యువతకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ ముస్లింల విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందన్న వాదన అవాస్తవం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముస్లింలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, సనత్ నగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సీట్లలో విజయం సాధించింది. ఓ రకంగా చెప్పాలంటే ముస్లింలను తెలంగాణ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు, టీఎస్ఐడీసీ, నెడ్ క్యాప్, సెట్విన్‌లకు కూడా 2017లో ముస్లింలనే చైర్మన్లుగా నియమించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే.

న్యూస్ 18తో బాబా ఫసీయుద్దీన్, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్

Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా?

దీంతో పాటు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులను ముస్లింలకు ఎక్కువగా ఇవ్వకూడదని కూడా టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. ఒకవేళ ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తే.. ఇదే అదునుగా తీసుకొని బీజేపీ ప్రచారం చేస్తుందని, దీనిద్వారా హిందూ ఓట్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది.

కాగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలోని ముస్లింలందరూ చాలా సంతోషంగా ఉన్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతుగా నిలిచారని గులాబీ పార్టీ మైనార్టీ నేత మహమ్మద్ ఖలీల్ ఉర్ రహ్మన్ న్యూస్ 18తో అన్నారు. షాదీ ముబారక్, టీఎంఆర్ఐఈఎస్, సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ సహా ఎన్ని అద్భుతమైన పథకాలను ముస్లింల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ సెక్యులర్ నేత అని స్పష్టం చేశారు. అలాగే ముస్లింల పట్ల పార్టీ రెండు విధానాల వ్యూహాలను అమలు చేయనుందన్న దాన్ని ఆయన అంగీకరించలేదు.

TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక నుంచి వాటిపై నిషేధం

2014కు ముందు హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని ప్రాంతాల ముస్లిం ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారని, ఆ తర్వాత టీఆర్ఎస్ వైపు మళ్లారని రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. అయితే హైదరాబాద్ లోని ముస్లిం ఓటర్లు ఎప్పుడూ ఎంఐఎంకు మద్దతుగానే నిలుస్తూ వస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 40 సంవత్సరాల వయసు లోపల ఉన్న ముస్లింలు టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తున్నారని, కానీ సీనియర్ సిటిజన్లు ఇంకా కాంగ్రెస్ వైపే ఉన్నారని వివరించారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Bjp, CM KCR, Telangana, Telangana bjp, Telangana Politics, Trs, TRS leaders

ఉత్తమ కథలు